Begin typing your search above and press return to search.
చైనా ఇలా... రిషి సునక్ అలా!
By: Tupaki Desk | 25 July 2022 8:03 AM GMTబ్రిటన్ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్‌వన్ ప్రమాదకారి అని రిషి సునాక్ వ్యాఖ్యానించడం గమనార్హం. చైనా, రష్యా పట్ల రిషి సునాక్ బలహీనుడని ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో రిషి మాట్లాడుతూ చైనాపై ధ్వజమెత్తారు. తాను బ్రిటన్ ప్రధానమంత్రిని అయితే చైనాకు దబిడ దిబడేనని తేల్చిచెప్పారు.
రిషి సునాక్ చైనాపై నిప్పులు చెరిగితే.. చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ మాత్రం రిషి సునాక్ ను ఇటీవల ప్రశంసిస్తూ కథనాలు ఇచ్చింది. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే చైనా-యూకే సంబంధాలు గణనీయంగా మెరుగుపడతాయని చైనా అభిప్రాయపడుతోంది. అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని గ్లోబల్ టైమ్ పేర్కొంది.
కాగా బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడితే బ్రిటన్ లో ఉన్న 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామని రిషి సునాక్ చెబుతున్నారు. ఈ 30 సంస్థల ద్వారా తన సంస్కృతి, భాషను చైనా వ్యాప్తి చేస్తోందని.. ఈ సాఫ్ట్ పవర్ ప్రభావాన్న అడ్డుకుంటానని సునాక్ అంటున్నారు. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తానని తెలిపారు. చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకుంటామని రిషి సునక్ చెబుతున్నారు.
చైనా.. బ్రిటన్ లోకి చొరబడి దేశ సాంకేతికతను దొంగిలిస్తోందని రిషి సునక్ మండిపడుతున్నారు. అలాగే బ్రిటన్ విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోందన్నారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు చైనా మద్దతుగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తైవాన్‌తో సహా ఇరుగుపొరుగు దేశాలను బెదిరిస్తోందని దుయ్యబట్టారు.
అలాగే ఆయా ప్రపంచ దేశాలకు అప్పులు మీద అప్పులు ఇస్తూ తన అధీనంలోకి చైనా తెచ్చుకుంటోందని రిషి సునాక్ మండిపడ్డారు. అలాగే.. చైనా తన దేశంలోని జింజియాంగ్, హాంకాంగ్‌లలో సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తోందని నిప్పులు చెరిగారు. చైనా తన కరెన్సీని తగ్గించుకుంటూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఆ దేశానికి అనుకూలంగా మలుచుకుంటోందని రిషి సునాక్ చెబుతున్నారు. కాబట్టి తాను బ్రిటన్ ప్రధాని అయిన మొదటి రోజే చైనాకు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
కాగా బ్రిటన్ ప్రధాని రేసులో ఇప్పటిదాకా దూసుకుపోయిన భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్.. అనూహ్యంగా వెనుకబడ్డారు. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచిన రిషికి.. ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించినమేర మద్దతు లభించటం లేదని సమాచారం. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారని అంటున్నారు.
తుదిపోరులో లక్షా 60 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఇందులో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహిస్తారు. కాబట్టి, రిషి ఎంతమంది సభ్యుల మద్దతు కూడగడితే ఆయన విజయావకాశాలు అంత మెరుగవుతాయి. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు మెుదటివారం వరకు 12 విడతలుగా తుదిపోరు జరగనుంది.