Begin typing your search above and press return to search.
బ్రిటన్ కు రిపేర్ లో భాగంగా రిషి మరో కీలక నిర్ణయం
By: Tupaki Desk | 30 Oct 2022 3:57 PM GMTతీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బ్రిటన్ కు రిపేర్ చేసే ప్రయత్నంలో కఠిన నిర్ణయాలు తీసుకోవటం ఖాయమని ఇప్పటికే స్పష్టం చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్.. ఆ దిశగా మరో కీలక అడుగు వేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ ప్రత్యేక కథనాన్ని పబ్లిష్ చేసింది.
సంపన్న దేశమైన బ్రిటన్.. తన జాతీయ ఆదాయంలో 0.5 శాతాన్ని ప్రపంచంలోని పలు దేశాలకు సాయం కోసం వెచ్చిస్తుంటుంది. కరోనా.. తదనంతర పరిణామాల నేపథ్యంలో విదేశీ సాయాన్ని రెండేళ్లుగా నిలిపివేసింది. అందుకు ఖర్చు చేసే మొత్తాన్ని సొంత ప్రజలకు ఖర్చు చేస్తోంది. ఇదిలా ఉంటే.. విదేశీ సాయాన్ని మరో రెండేళ్ల పాటు నిలిపివేయాలన్న అంశంపై రిషి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడున్న నిషేధాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించే వీలుందన్న అంచనా వేస్తున్నారు. విదేశీ సాయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రధానితో పాటు ఛాన్సలర్ ఉమ్మడిగా తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. కరోనాకు ముందు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన రిషి సునాక్.. అప్పట్లో విదేశీ సాయాన్ని 2024-25 నాటికి 0.7 శాతానికి పెంచుతామని పేర్కొన్నారు. అయితే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2026-27 వరకు విదేశాలకు ఇచ్చే సాయాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నఆలోచనలో ఉన్నట్లుగా సదరు కథనం పేర్కొంది.
సంక్షోభంలో ఉన్న ఆర్థిక రంగాన్ని సరి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమలవుతున్న విదేశీ సాయం నిలిపివేతను మరింతకాలం కొనసాగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో ఆహారం.. ఇంధనం.. ఇళ్ల కొనుగోలుపై పన్ను తగ్గింపును రద్దు చేస్తూ నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకోవటం తెలిసిందే. ఈ స్వస్థత చర్యలు ఎంతమేర సత్ఫలితాన్నిఇస్తాయో చూడాలి.