Begin typing your search above and press return to search.
రష్యా-ఉక్రెయిన్ వార్ లోకి బ్రిటన్ ఎంటర్ అవుతుందా?
By: Tupaki Desk | 20 Nov 2022 9:30 AM GMTరష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్ని నెలలుగా భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన వార్ విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ కు ఇప్పటికే అపారమైన ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం సంభవించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ ఏమాత్రం తలొగ్గకుండా ఒంటరిగా పోరాటం చేస్తోంది.
ప్రపంచ దేశాలు తమను ఒంటరి చేశాయని యుద్ధం ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపణలు చేశారు. అయితే అమెరికా.. నాటో దేశాలు నేరుగా యుద్ధం పాల్గొనకుండా ఆయుధాలను సరఫరా చేస్తూ ఉక్రెయిన్ కు సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సైనికులు రష్యాకు ధీటుగా జవాబిస్తున్నారు.
భారత్ సహా చాలా దేశాలు యుద్ధం వల్ల ఒరిగేదీ ఏమి ఉందని.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చర్చల దశ ముగిసిపోవడంతో ప్రపంచ దేశాలు సైతం రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో గత పది నెలలుగా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే వస్తోంది.
ఈక్రమంలోనే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సడెన్ గా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ ఇండోనేషియాలో జరిగిన జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. భారత్.. అమెరికా.. ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులతో పలు అంశాలపై చర్చించారు.
జీ20 సదస్సులో సైతం రష్యా-ఉక్రెయిన్ వార్... ఆర్థిక మాంద్యం తదితర పరిస్థితులపై ఆయా దేశాధ్యక్షులు చర్చించారు. జీ20 సదస్సు ముగిసిన వెంటనే బ్రిటన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ యుద్ధ భూమిలో అడుగుపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ఉక్రెయిన్ కు వెళ్లే కొద్ది గంటల ముందు వరకు కూడా ఈ విషయం బయటికి రాకపోవడం గమనార్హం.
ఇక ఈ విషయం అందరికీ తెలిసేలోగా రిషి సునాక్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రత్యక్షమయ్యారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న కీవ్ నగరాన్ని.. ద్వంసమైన యుద్ధ ట్యాంకులు.. శిథిలమైన భవనాలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని విధాలా ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామని రిషి సునాక్ అభయం ఇచ్చారు.
రష్యాకు ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్‌లకు ధీటుగా 125 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌ను ఉక్రెయిన్ కు వెంటనే అందజేయనున్నట్లు ప్రకటించారు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలతో కలిసి తాము సైతం రష్యాపై పలు ఆంక్షలు విధించిన విషయాన్ని జెలెన్ స్కీకు గుర్తు చేశారు. ఉక్రెయిన్ కు బ్రిటన్ అండగా ఉంటుందని చెప్పేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన వివరించారు.
ఏది ఏమైనా యుద్ధ సమయంలో ఒక దేశ అధ్యక్షుడు లేదా ప్రధాని నేరుగా ఉక్రెయిన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడే అవకాశం కనిపించడం లేదు.