Begin typing your search above and press return to search.

వందల ఏళ్లు మనల్ని ఏలిన తెల్లోళ్లకు ప్రధానిగా మనోడు!

By:  Tupaki Desk   |   14 Jan 2022 11:00 AM IST
వందల ఏళ్లు మనల్ని ఏలిన తెల్లోళ్లకు ప్రధానిగా మనోడు!
X
చింతపండు అమ్ముకుంటామని చెప్పి.. మన దేశాన్ని తెగ దోచేశారు ఈ తెల్ల ఎదవలు. ఈ మాత్రం ఉమ్మకపోతే.. భారతమాతకు అవమానం’’

32 ఏళ్ల క్రితం వచ్చిన జయంమనదేరా సినిమాలో సీన్ ఇది. ఈ సీన్ చూసినోళ్లంతా ఏం పంచ్ వేశాడ్రా అనుకోకుండా ఉండలేం. నిజానికి.. ఈ సినిమానే కాదు.. లండన్ లో అడుగు పెట్టిన చాలామంది భారతీయులు సైతం ఇదే తీరులో రియాక్టు అవుతుంటారు. కొందరు మర్యాదస్తులుగా నటించేటోళ్లు మాత్రం.. మనసులో తిట్టుకోవటమేకాదు.. వీరి సంపదలో మన వాటా ఉందిగా అనుకోకుండా ఉండలేరు.అంతేకాదు.. ఏదో ఒక రోజున ఈ తెల్లోళ్ల రాజ్యాన్ని ఏలే అవకాశం మనకు దేవుడు ఎందుకు ఇవ్వరని కోరుకునేటోళ్లకు లోటు లేదు. ఇప్పుడు అలాంటిదే జరగనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదెలానంటే..

అలాంటి తెల్లోళ్ల సామ్రాజ్యాన్ని ఇప్పుడు.. భారత మూలాలు ఉన్నోడు ఒకరు దేశ ప్రధాని అయ్యే అవకాశం రానుంది. ఏ తెల్ల దొరలు (?) అయితే నాలుగు వందల ఏళ్లకు పైనే పాలించిన వారి సొంత గడ్డను ఏలే అవకాశం మనోడికి దక్కటానికి మించిన విషయం మరేం ఉంటుంది. అవును.. భారత్ సంతతికి చెందిన రిచ్ మండ్ ఎంపీ రిషి సనక్ కు బ్రిటిష్ ప్రధాని పీఠాన్ని అధిష్టించే అవకాశాలు మెరుగు అవుతున్నట్లుగా చెప్పాలి.

ఇంతకీ ఎవరీ రిషి సనక్ అంటే.. మరెవరో కాదు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడే ఇతగాడు. ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. త్వరలో ప్రధాని పీఠాన్ని అధిరోహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఆర్థిక మంత్రిగా రుషి నియమకాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 సంతోషంగా ఆమోదించినట్లుగా సుమారు రెండేళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించటం తెలిసిందే.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రుషి.. బ్రిటన్ పార్లమెంటుకు 2015లోతొలిసారి ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ విషయంలో బోరిస్ వ్యూహానికి మద్దతుగా నిలిచిన అతను.. చాలా వేగంగా బ్రిటన్ రాజకీయాల్లో ఎదిగారు. బ్రిటన్ లో పుట్టిన రుషి సనక్.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తెను అక్షతను వివాహమాడటం తెలిసిందే. తాజాగా బోరిస్ మీద విపక్షంలోనే కాదు.. సొంత పార్టీలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. ఈ ఏడాది చివర్లో ఆయన ప్రధాని పీఠాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఆయన స్థానంలో మనోడు రిషి సనక్ కే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ పదవి కోసం విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్.. కేబినెట్ మంత్రి మిచేల్ గోవ్.. విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెర్మీహంట్ తో పాటు పాక్ సంతతికి చెందిన సాజిద్ జావెద్ కూడా పోటీ పడుతున్నారు. అయితే.. వీరందరికంటే రిషినే ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. తెల్లోళ్ల సొంతగడ్డను మనోడు పాలించటమనే స్వప్నం సాకారమవుతుందని చెప్పక తప్పదు.