Begin typing your search above and press return to search.
మోదీని కలిసిన వెంటనే గుడ్ న్యూస్ చెప్పేశాడు..!
By: Tupaki Desk | 16 Nov 2022 3:16 PM GMTఇండోనేషియా రాజధాని బాలిలో జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు నేటితో ముగియనుంది. ఇవాళ్టి సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మక్రాన్.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 20 దేశాల దేశాధినేతలు పాల్గొన్నారు.
జీ 20 సదస్సులో భాగంగా తొలి రోజు సెషన్స్ లో పాల్గొన్న మోదీ తీరిక లేకుండా గడిపారు. ఆహార భద్రత.. ఇంధన భద్రత.. ఎరువు కొరత తదితర అంశాలపై ప్రస్తావించారు. ఈ సమ్మిట్ భాగంగా జో బైడెన్.. మోదీ కొద్దిసేపు సరాదా ముచ్చటించుకోవడం కన్పించింది. అలాగే మోదీతో ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మక్రాన్ తో మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
తొలి రోజు సెషన్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనందుకు రిషి సునాక్ ను మోదీ అభినందించారు. అనంతరం వీరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే రిషి సునాక్ చేపట్టిన పలు కార్యక్రమాలను తెలుసుకొని తెలుసుకొని మోదీ ప్రశంసించారు.
ఈక్రమంలోనే భారత్-బ్రిటన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు.. దౌత్య సంబంధాలపై ప్రస్తావించారు. అదేవిధంగా త్వరలో భారత పర్యటనకు రావాలని రిషి సునాక్ ను మోదీ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కలయిక తర్వాత బ్రిటన్ ప్రధాని కార్యాలయం నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది.
ఇప్పటి వరకు భారతీయులకు ఇస్తున్న వీసా కోటాను పెంచుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతీ ఏడాది మూడు వేలకు పైగా బ్రిటన్ వీసాలను భారతీయులను అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 18 ఏళ్ళు నిండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి డిగ్రీ పట్టా ఉన్న భారతీయులు తమ దేశంలో రెండేళ్లపాటు పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ద్వారా భారత్ బ్రిటన్ మధ్య కొనసాగుతున్న మైగ్రేషన్.. మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ను మరింతగా బలోపేతం చేస్తుందని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వివరించింది. ఇండో ఫసిపిక్ రీజయన్ లోని అన్ని దేశాల కంటే భారత్ తోనే బ్రిటన్ అత్యంత సన్నితంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి బ్రిటన్ వస్తున్న విద్యార్థుల్లో భారతీయులే నాలుగోవంతు ఉన్నారని పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.