Begin typing your search above and press return to search.
బీజేపీలో పెరిగిపోతున్న పవన్ టెన్షన్
By: Tupaki Desk | 30 March 2021 6:30 AM GMTబీజేపీలో రోజురోజుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెన్షన్ పెరిగిపోతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధిగా రత్నప్రభ సోమవారం నామినేషన్ వేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన రత్నప్రభ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో సహా చాలామంది సీనియర్ నేతలు హాజరయ్యారు. కానీ జనసేన నుండి ఒక్కరంటే కనీసం ఒక్కనేత కూడా హాజరుకాలేదని సమాచారం.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విషయంలో మిత్రపక్షాల మధ్య మొదటినుండి వివాదం నడుస్తోంది. ఏ పార్టీకి ఆపార్టీయే అభ్యర్ధిని నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలే చేసుకున్నాయి. అయితే తెరవెనుక ఏమైందో ఏమోగానీ చివరకు బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభే పోటీలోకి వచ్చేశారు. తమ అభ్యర్ధిని బీజేపీ అధికారికంగా ప్రకటించినప్పటినుండి ఇప్పటి వరకు పవన్ కానీ జనసేన కానీ ప్రకటనరూపంలో కూడా కనీసం మద్దతు ప్రకటించలేదు.
చివరకు రత్నప్రభ+సోమువీర్రాజు అండ్ కో పవన్ ఇంటికి వెళ్ళి మద్దతుకోరాల్సొచ్చింది. ఇంతజరిగినా తనకు మద్దతుగా పవన్ ప్రచారంలోకి వస్తారని అభ్యర్ధి చెప్పుకున్నారే కానీ పవన్ మాత్రం నోరిప్పలేదు. దాంతో రెండుపార్టీల మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బయట జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారే కానీ జనసేన నేతలు మాత్రం మాట్లాడటంలేదు.
అయితే సోమవారం రాత్రి తిరుపతిలో బీజేపీ+జనసేన నేతల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పవన్ లెఫ్టినెంట్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రెండుపార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తారని ప్రకటించారు. అయితే ప్రకటన వచ్చిన మరుసటిరోజే రత్నప్రభ నామినేషన్ కార్యక్రమంలో జనసేన నుండి ఏ నేత కూడా హాజరుకాలేదట. దాంతో పవన్ మనసులో ఏముందో ? నాదెండ్ల చేసిన ప్రకటన ఏమైందో ? కమలనాదులకు అర్ధంకాక టెన్షన్ పెరిగిపోతోంది.