Begin typing your search above and press return to search.
వివేకా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని
By: Tupaki Desk | 14 Dec 2021 5:32 AM GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చిక్కుముడులు వీడడం లేదు. ఈ కేసులో ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని కడప ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే వాళ్ల ముగ్గురి పేర్లు ప్రస్తావిస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. వీళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీని పీఏ కోరారు.
వైఎస్ వివేకాకు కృష్ణారెడ్డి మంచి నమ్మకస్తుడైన పీఏగా గుర్తింపు పొందారు. 30 ఏళ్ల పాటు వివేకా వెంట ఉన్నారు. వివేకా తుదిశ్వాస విడిచేవరకూ పీఏగా కొనసాగారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందనే చర్చ సాగుతోంది.
ఇటీవలే వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన సొంత అల్లుడు, కూతురు సునీత భర్త అయిన రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని పులివెందులకు చెందిన జర్నలిస్ట్ భరత్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విధంగా వివేకా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ అనంతపురం ఎస్పీకి యాడికి చెందిన గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేయడం.. తాజాగా పీఏ కృష్ణారెడ్డి ముందుకు రావడంతో హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.