Begin typing your search above and press return to search.
ప్రతిపక్షానికి షాక్ః పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 20 Oct 2016 5:19 PM GMTఢిల్లీ పీఠాన్ని చేరుకునేందుకు షార్ట్ కట్‌గా భావించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో గెలుపొందాలని పావులు కదుపుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా...కీలక నేత రీటా బహుగుణ జోషి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లఖ్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి రీటా 2012లో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందిన రీటా తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ శిబిరానికి షాక్ ఇవ్వగా బీజేపీలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
పార్టీలో చేరిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రీటా బహుగుణ మాట్లాడుతూ... 24 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించానని అయితే దేశ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరానని ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ సాక్ష్యాలు అడగటం బాధకలిగించిందన్నారు. అయితే రాజకీయంగా వేరే కారణాలు ఉన్నాయని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ను - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ ను ప్రకటించడం పట్ల అసంతృప్తితోనే రీటా కాంగ్రెస్ కు దూరమయ్యారని అంటున్నారు. 67ఏళ్ల రీటా యూపీలో కీలక రాజకీయవేత్త. ఆమెది స్వతహాగా రాజకీయ కుటుంబం. కాంగ్రెస్ మాజీ నేత - యూపీ మాజీ సీఎం హేమ్ వతి నందన్ బహుగుణా కుమార్తె రీటా బహుగుణ జోషి. ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ రీటాకు స్వయంగా సోదరుడు. అలహాబాద్ లో సమాజ్ వాదీ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా నామినేట్ అవ్వడం ద్వారా రీటా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కీలక నేతగా ఎదిగారు. రీటా రాకతో యూపీలో భాజపా బలం మరింత పెరుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/