Begin typing your search above and press return to search.

లాలూ.. ఇక ఊపిరి పీల్చుకో.!

By:  Tupaki Desk   |   17 April 2021 9:47 AM GMT
లాలూ.. ఇక ఊపిరి పీల్చుకో.!
X
ఎట్టకేలకు మాజీ సీఎం ఊపిరి పీల్చుకోనున్నాడు. బీహార్ ముఖ్యమంత్రిగా 90వ దశకంలో లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే తాజాగా నాలుగు కేసుల్లో మూడింటిలో బెయిల్ రాగా.. నాలుగో కేసులోనూ బెయిల్ రావడంతో లాలూ జైలు నుంచి విడుదల కానున్నారు.

ఝర్ఖండ్ హైకోర్టు శనివారం లాలూకు బెయిల్ మంజూరు చేసింది. లాలూ బీహార్ సీఎంగా ఉన్న సమయంలో పశుగ్రాసం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు విత్ డ్రా చేసినట్టు దోషిగా నిర్ధారణ కావడంతో సీబీఐ కోర్టు ఆయనకు జైలు శిక్ష ఖరారు చేసింది.

మూడింట్లో బెయిల్ వచ్చి ప్రస్తుతం నాలుగో కేసులోనూ బెయిల్ రావడంతో లాలూ జైలు నుంచి విడుదల కానున్నాడు. ప్రస్తుతం లాలూ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత లాలూ ఇంటికి వెళ్లనున్నాడు.

గత ఏడాది అక్టోబర్ 9న లాలూకు 2 లక్షల పూజీకత్తుతో ఝార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. అయితే 3 కేసుల్లో బెయిల్ వచ్చి నాలుగో కేసులో రాలేదు. ఇప్పుడు వచ్చేసింది. 1990లో లాలూ బీహార్ సీఎంగా ఉన్న సమయంలో ఈ స్కాం జరిగింది. 2017లో దోషిగా తేలి శిక్ష పడింది.