Begin typing your search above and press return to search.
కొత్త గొడవ- కర్ణాటక మంటలు బీహార్ లో !
By: Tupaki Desk | 18 May 2018 11:32 AM GMTఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్న రీతిగా తయారైంది బీజేపీ పరిస్థితి. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి చెప్పిందల్లా చెల్లుతుందని ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వి కెన్ మేక్ ది రూల్స్ ...వి కెన్ బ్రేక్ ది రూల్స్ అన్నట్లు వ్యవహరిస్తోన్న మోదీ సర్కార్ కు విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇదే ఫార్ములాను తమకూ అప్లై చేసి....ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా అవతరించిన పార్టీలు...తమకూ కర్ణాటక తరహాలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్లను కోరుతున్నాయి.
తాజాగా, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం - ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్....తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను శుక్రవారం నాడు కలవడం చర్చనీయాంశమైంది. కర్ణాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను తేజస్వి యాదవ్ కలిశారు. బీహార్ లో ఆర్జేడీనే అతి పెద్ద పార్టీ అని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని వినతి పత్రం సమర్పించారు. గవర్నర్ కు తమ మెజార్టీ నిరూపించేందుకు రెడీగా ఉన్నామని తేజస్వి యాదవ్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమపార్టీకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. దీంతో, బీజేపీ తీసుకున్న గోతిలో అదే పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహాలో గోవా - మణిపూర్ - మేఘాలయాలలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి తిప్పలు తప్పవని అనుకుంటున్నారు.