Begin typing your search above and press return to search.
అమ్మ సీటుకు రూ.50 కోట్ల ఖర్చుకు రెఢీ
By: Tupaki Desk | 29 March 2017 4:51 AM GMTతమిళనాడు అమ్మ జయలలిత మరణంతో.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కే నగర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఇప్పుడు ఈసీకి షాకులమీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవటంతో ఈ ఎన్నికను ఈవీఎం కాకుండా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిద్దామా? అని కిందామీదా పడుతున్న ఈసీకి.. ఈ ఎన్నిక కోసం అభ్యర్థులు ఖర్చు పెట్టాలనుకున్న మొత్తం లెక్క విని ఈసీ వర్గాల నోట వెంట మాట రావటం లేదంటున్నారు.
రాజకీయంగా అత్యంత కీలకమైన ఆర్కే నగర్ సీటును చేజిక్కించుకోవటానికి వివిధ వర్గాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బును వెదజల్లేందుకు రంగం సిద్ధం చేశారు.అమ్మకు ఫ్యూచర్ వారసురాలన్న కోణంలో సాగుతున్న ఈ ఎన్నిక పలితం భవిష్యత్ రాజకీయాల్ని కచ్ఛితంగా ప్రభావితం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
బరిలో 69 మంది అభ్యర్థులున్నా.. పోటీ మాత్రం అన్నాడీఎంకే చీలిక వర్గాలైన శశికళ.. పన్నీరు వర్గాల అభ్యర్థులతో పాటు.. బరిలో ఉన్న అమ్మమేనకోడలు దీప.. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. మరో విపక్షమైన డీఎండీకేతో పాటు.. బీజేపీ అభ్యర్థి సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ప్రధానంగాఈ ఎన్నిక నలుగురికి జీవన్మరణ సమస్యగా మారిందని చెప్పాలి.
అన్నాడీఎంకే చీలికవర్గమైన శశి..పన్నీర్ ల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు నేపథ్యంలో..ఈఎన్నికల్లో విజయం సాధించిన వారికి అమ్మ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం చేసుకోవటానికిఅనువుగా ఉందన్న ప్రచారం సాగుతోంది.అంతేకాదు..ఈ రెండు వర్గాల మధ్య తమదే అసలైన అమ్మ వర్గమన్న వాదన ఉంది. ఈ ఫలితం ఆ విషయం మీద కూడా మరింత క్లారిటీ తెచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో..ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఇరుపక్షాలవారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..అమ్మకు అసలైన వారసురాలిని తానేనని చెప్పుకునే దీపా జయకుమార్.. ఆ విషయాన్నిప్రజలు ఓకే చెప్పారా? లేదా?అన్నది ఎన్నికల పలితం డిసైడ్ చేస్తుందని చెప్పాలి.
ఇక.. ఎన్నికల బరిలో ఉన్న ప్రధానప్రతిపక్షం డీఎంకేకు కీలకంగా మారనుంది.అమ్మ లేని వేళ..ఫ్యూచర్ అంతా తమదేనన్న మాటను చెప్పుకుటున్న డీఎంకేకు.. తమిళ ప్రజలు ఎంతమేర పట్టం కడతారన్నది తాజా ఎన్నికల ఫలితం తేల్చేస్తుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఏం చేసైనా సరే.. ఆర్కేనగర్ లో పాగా వేయటం ఇప్పుడు ప్రధాన అంశంగామారిందని చెప్పాలి.
మొత్తం 2.62లక్షల ఓటర్లు ఉన్న ఆర్కేనగర్ లో 75 శాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉందనిభావిస్తున్నారు.70వేల మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించగలిగితే విజయం తమదేనన్న లెక్కలో ఉన్న పార్టీలు.. ఆ దిశగా తమ ప్రయత్నాల్నిముమ్మరం చేస్తున్నాయి. ఓటుకు రూ.2వేలనుంచి రూ.3వేల మధ్యన పంచుతున్నట్లుగా చెబుతున్నారు. గెలుపే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీలు.. ఈ ఉప ఎన్నిక కోసం రూ.50కోట్ల మేర ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ఎవరిదాకానో ఎందుకు.. చిన్నమ్మ వర్గం నుంచి బరిలో ఉన్న దినకరన్ ముచ్చటే తీసుకుంటే.. ఆర్కేనగర్ లో ఆయన కానీ గెలిస్తే.. అమ్మ వారసుడిగా ప్రజలుపట్టం కట్టారన్నమాటతో సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది ఆశగా చెబుతున్నారు. ఇలా ఎవరికి వారికి ముఖ్యమైన కారణాలు ఉండటంతో అమ్మస్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపు ఇప్పుడు పలువురికి తప్పనిసరైంది. అదే ఇప్పుడు.. పెద్ద ఎత్తున నోట్లతో ఓట్లను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఎన్నికల ఖర్చు అంచనా..పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ..ప్రత్యర్థులు పంచే నోట్లను తగ్గట్లుగా మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/