Begin typing your search above and press return to search.
ఈసారి కూడా గెలుపు నాదే - రోజా
By: Tupaki Desk | 22 March 2019 1:42 PM GMT2014 ఎన్నికల్లో రోజా నగరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యే అయ్యేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు. అంతిమంగా 2014 ఎన్నికల్లో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ ఇప్పుడు కూడా రోజాకే నగరి టిక్కెట్ ఇచ్చింది. దీంతో.. రోజా శుక్రవారం నగరిలో నామినేషన్ దాఖలు చేశారు. భారీ జన సందోహంతో రోడ్ షో నిర్వహించిన రోజా.. ఈసారి కూడా విజయం తనదే అని చెప్పారు.
నగరిలో నామినేషన్ వేసిన తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. “ఈసారి ఎన్నికల్లో కూడా నాదే గెలుపు. ప్రజలు వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. అన్నింటికి మించి ప్రత్యేక హోదా అనేది వైసీపీతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారు. ఈ ఐదేళ్లలో నగరి నియోజకవర్గం కోసం చాలా చేశాను. ఇంకా చెయ్యాలని అనుకున్నా.. చంద్రబాబు నిధులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. నన్ను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డు పడ్డారు. ఇక పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి తొత్తుగా మారారు. గతంలో లోకేష్ అవినీతిని ప్రశ్నించి పవన్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారని గుర్తుచేశారు. నగరిలో దళితుల ఓట్లను చీల్చేందుకు ఇక్కడ బీఎస్పీ అభ్యర్థికి సీటు ఇచ్చారు. అయితే ఎంతమంది వచ్చినా నగరిలో గెలుపు నాదే” అని అన్నారు రోజా.