Begin typing your search above and press return to search.
బాబు విజన్ 2020 ... 20 ఎమ్మెల్యేలు 20 గ్రామాలు !
By: Tupaki Desk | 21 Jan 2020 6:23 AM GMTఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పై పెద్ద దుమారం రేగుతోంది. వైసీపీ , టీడీపీ మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. మూడు రాజధానులకి ఏపీ ప్రభుత్వం మద్దతు తెలుపుతుంటే ..టీడీపీ మాత్రం అమరావతి లోనే రాజధాని కావాలి అని ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మూడు రాజధానుల బిల్లు పై చర్చ జరుపుతున్నారు.
ఇకపోతే నేడు అసెంబ్లీ లో మాట్లాడిన వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మూడు రాజధానుల అంశాన్ని అడ్డుకునేందుకు ఛలో అమరావతికి చంద్రబాబు పిలుపునివ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో డ్రామాలడుతున్నారని అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ తో రాజధాని ప్రాంతంలో భూములు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. గత ఐదేళ్ల పాలన లో చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. చంద్రబాబు విజన్ ఏంటో ఇప్పుడు తేటతెల్లమైందన్నారు. 2020 అంటే 20 ఎమ్మెల్యేలు 20 గ్రామాలు అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి గతంలో లక్షా పదివేల కోట్ల రూపాయలు అవసరమన్న చంద్రబాబు.. ఇప్పుడు రెండు వేల కోట్లతో పూర్తవుతుందంటున్నారు.