Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్: హైదరాబాద్ లో వైరస్ కి వ్యాక్సిన్ రెడీ ...!
By: Tupaki Desk | 28 May 2020 7:00 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని నివారించేందుకు అన్ని దేశాలు సీరియస్ గా వ్యాక్సిన్ తయారీకి కష్టపడుతున్నాయి. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల సైన్టిస్టులు చాలా కష్టపడుతున్నారు. అందులో మన దేశ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన రాఘవ లైఫ్ సైన్సెస్ (RLS) గుడ్ న్యూస్ చెప్పింది.
తాము వైరస్ ను నియంత్రించే దిశగా అనేక ప్రయోగాలు చేసి రూపొందించిన 'ఫావిపిరావిర్’ అనే మందును అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. జపాన్ లో వైరస్ పాజిటివ్ రోగుల చికిత్స కోసం వినియోగిస్తుండగా, చైనా, టర్కీ తదితర దేశాల అధ్యయనాల్లో ఈ మందు మంచి సత్ఫలితాలు ఇస్తోందని వెల్లడించింది. రష్యా దేశంలో నిర్వహించిన..క్లినికల్ ట్రయల్స్ లో 90 మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా..రోగి కొలుకొనే సమయం 11 రోజుల నుంచి 4 రోజులకు తగ్గిందని, అలాగే రికవరీ రేటు సైతం 55.86 శాతం నుంచి 71.43 శాతానికి పెరిగిందని RLS తెలిపింది.
ఇదిలా ఉంటే...కేవలం భారతదేశంలో లభించే ముడి పదార్థాలతోనే పావిపిరవిర్ టాబ్లెట్ రూపొందించినట్లు, ఇతర ఏ ఒక్క దేశంపై ఆధార పడే పరిస్థితి లేకుండా చేశామని వెల్లడించింది. భారత ఫార్మాస్యుటికల్ రంగం సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చని RLS కంపెనీ డైరెక్టర్ లోహిత్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తి సాధ్యమైందని, ఫలితాలు కూడా మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఇక ఒక్కసారి క్లినికల్ ట్రైల్స్ విజయ వంతం అయితే, అభివృద్ధి చెందుతున్న ఇండియాతో పాటు అనేక పేద దేశాలకు గొప్ప మేలు జరుగుతుందన్నారు.