Begin typing your search above and press return to search.
తాగి రచ్చ చేసిన బీఎండబ్ల్యూ అమ్మాయ్!
By: Tupaki Desk | 26 Aug 2017 6:49 AM GMTకావాల్సినంత సంపద. తప్పు చేస్తే సరిదిద్దుకోగలమన్న పవర్ ఉందన్న అహంకారమో ఏమో కానీ.. ఇటీవల కాలంలో సంపన్నుల సంతానం చెలరేగిపోతున్న తీరు హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తుంటుంది. ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా.. తాగి వాహనాల్ని నడిపితే ప్రాణాలు పోవటం ఖాయమన్న విషయం ప్రముఖుల ఇళ్లల్లో ఎన్ని ఉదంతాలు చోటు చేసుకున్నా.. అవేమీ మందుకు అలవాటు పడిన వారి తలకెక్కటం లేదు. ఈ విషయంలో అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఏ మాత్రం తీసిపోలేదంటున్నారు.
తాజాగా తప్ప తాగిన ఒక అమ్మాయ్ శుక్రవారం అర్థరాత్రి బంజారాహిల్స్ లో రచ్చ రచ్చ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఫుల్ గా తాగేసిన ఒక అమ్మాయి బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపిన ఆమె బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్దనున్న డివైడర్ ను ఢీ కొట్టినట్లుగా చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నారని.. కారు నడిపింది మాత్రం అమ్మాయేనని చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఫుల్ గా తాగేసి.. ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడిపేసి.. డివైడర్ కు గుద్దేసిన వారు.. ప్రమాదం అనంతరం కారు నెంబర్ ప్లేట్‌ను తమతో తీసుకెళ్లిన వైనం కలకలం రేపుతోంది.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపింది ఎవరు? కారు యజమాని ఎవరు? అన్న విషయాల్ని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.