Begin typing your search above and press return to search.
గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం ..ఆ ఐదుమంది మూడు గంటలు ఎక్కడున్నారు !
By: Tupaki Desk | 15 Dec 2020 9:14 AM GMTహైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలో షిఫ్ట్ కారును టిప్పర్ ఢీకొట్టిన దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే , కారులో ఉన్న ఐదుగురు కూడా మృతి చెందటంతో ఈ కేసు విచారణలో పోలీసులకి కష్టంగా మారింది. ఈ ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు మాదాపూర్ లో ఐదుమంది బయల్దేరిన నుంచి ప్రమాదం జరిగిన సంఘటన వరకు అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు పలు విషయాలను గుర్తించారు. రాత్రి 9:33కు మాదాపూర్‌లోని వసతి గృహం నుంచి కారులో బయల్దేరి ర్యాడిసన్ హోటల్ కు చేరుకున్నారు. రాత్రి 10:30 వరకు అక్కడే ఉన్నారు. అదే సమయంలో అక్కడి నుంచి బయల్దేరారు.రాత్రి 11:00లకు డీఎల్‌ఎఫ్ హోటల్ వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి 11:30లకు బయల్దేరి వారు కారులో ఐఐటీ జంక్షన్ వైపునకు వచ్చారు. ఆ తర్వాత...రాత్రి 2:33కు విప్రో జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే, రాత్రి 11:30లకు ఐఐటీ జంక్షన్ వద్ద వారి కారును గుర్తించిన పోలీసులకు, ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు అనేది అంతు చిక్కడం లేదు. 11:30--2:33 వరకు అంటే సుమారు మూడు గంటలు మృతులు ఎక్కడున్నారు, ఆ సమయంలో వారు ఏం చేశారు అనే విషయాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే వారి కాల్ డేటా ను కూడా పరిశీలిస్తున్నారు.
ఇకపోతే , వారు ప్రయాణించిన కారులో పోలీసులకు రెండు మద్యం బాటిళ్లు లభించాయి. వాటిపై ఎలాంటి పేరు లేకపోవడంతో అవి మద్యం బాటిళ్లా, ఎనర్జీ డ్రింక్స్ బాటిళ్లా, అనేది తేలాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు, అతివేగంతో కారు నడిపిన విధానం చూస్తుంటే యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ,మృతదేహాలకు ఉస్మానియాలో ఆదివారం పోస్టుమార్టం జరిగింది. మృతులు అతిగా మద్యం సేవించినట్లు కనిపించలేదని డాక్టర్‌లు చెప్పినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కొన్ని శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపినట్లు సమాచారం. అయితే ముఖ్యంగా ఆ అర్ధరాత్రి మూడు గంటల సమయం పాటు వారు ఎక్కడున్నారు , ఏం చేసారు అనే కోణంలో పోలీసులు విచారణ వేగ వంతం చేశారు. అది తెలిస్తే , ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.