Begin typing your search above and press return to search.
ఆరుగురిని బలిగొన్న భారీ రోడ్డు ప్రమాదం
By: Tupaki Desk | 5 May 2017 5:04 AM GMTరోడ్లు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం ఎవరిదైనా నిండు ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతను పెంచటంలోనూ.. కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకోవటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
గురువారం అర్థరాత్రి దాటినతర్వాత చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణాలు చూస్తే.. కర్నూలు - గుంటూరు రోడ్డులో మేడికొండూరు మండలం భీమనేనివారి పాలెం - మేడికొండూరు గ్రామాల మధ్య ఈ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వస్తున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొ్ట్టింది. అప్పటికే బొలెరో వాహనం వేగంగా ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది.
రెండు వాహనాల మద్య వేగం ఎక్కువగా ఉండటంతో.. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరోలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నపోలీసులు.. ప్రమాదానికి కారణాల్ని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు ఎవరు? ఎక్కడి వారు? అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. లారీ డ్రైవర్ కు సంబంధించిన సమాచారం బయలకురాలేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్ని అందాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/