Begin typing your search above and press return to search.
'సీమ'ను అమరావతితో కలిపే భారీ రోడ్డు ప్లాన్ కు ఓకే చెప్పేశారు
By: Tupaki Desk | 22 Aug 2021 8:12 AM GMTబాబు ప్రభుత్వంలో అమరావతిని ఏపీ రాజధానిగా డిసైడ్ చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్నడిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చి.. అమరావతిని శాసన రాజధానిగా డిసైడ్ చేయటం తెలిసిందే. దీనిపై వాదనలు.. కోర్టు కేసులు.. పోరాటాలు.. ఇలా చాలానే జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక వైపు సాగుతుండగా.. మరోవైపు రాయలసీమకు అమరావతికి కనెక్టివిటీకి సంబంధించిన ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి తాజాగా ఓకే చెప్పేసింది భారత జాతీయ రహదారుల సంస్థ.
దీంతో.. రాయలసీమకు అమరావతికి మధ్య రాచబాట పడినట్లేనని చెప్పాలి. దాదాపు రూ.9వేల కోట్లతో నిర్మించే ఈ నాలుగు లైన్లు 417.91 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని నిర్మించనున్నారు. దీంతోఇప్పటివరకు సీమ టు అమరావతికి మధ్య నెలకొన్న రహదారి కష్టాలు తీరిపోవటమే కాదు.. ప్రయాణ సమయం చాలామేర తగ్గే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ప్రతిపాదన పాతదే. కాకుంటే.. అప్పట్లో అటవీ భూముల్ని సేకరించాలని నిర్ణయించారు. అయితే.. అటవీ భూములు సేకరిస్తే.. దానికి బదులుగా రెట్టింపు భూముల్ని అటవీశాఖకు కేటాయించాలసి ఉంటుంది. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ నో చెప్పింది.
అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ అంశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేసింది. అనంతపురం - అమరావతి అనుసంధానినిక వీలుగా అనంతపురం నుంచి కర్నూలు.. అక్కడ నుంచి ప్రకాశం.. గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు.. గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రోడ్డు నిర్మాణ పనుల్ని వేగంగా నిర్వహిస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంత - గుంటూరు మధ్య నాలుగులైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదనల్ని పంపింది. దీనికి కేంద్రం ఓకే చెప్పింది.
ఈ మొత్తం ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా నిర్మించాలని డిసైడ్ అయ్యారు అందులో మొదటి ప్యాకేజీలో అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తారు. ఇందుకోసం రూ.2130 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఆమోదించారు. రెండో ప్యాకేజీలో బుగ్గ నుంచి కర్నూలు మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తారు ఇందుకోసం రూ.4550 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూడో ప్యాకేజీలో గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణాన్ని చేస్తున్నారు. ఈ 112 కి.మీ. మేర రోడ్డు కోసం రూ.845 కోట్లు ఖర్చు చేయనున్నారు. నాలుగో ప్యాకేజీలో వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కి.మీ. మేర నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తారు. ఇందుకు రూ.1475 కోట్ల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీంతో.. సీమ టు అమరావతి మధ్య రోడ్డు కనెక్టివిటీ పెద్ద ఎత్తున పెరగటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.