Begin typing your search above and press return to search.
చోరీకి అడ్డొచ్చాడని ఎస్ ఐ పైకే కారు ఎక్కించబోయారు
By: Tupaki Desk | 24 Sep 2019 5:31 AM GMTతమ చోరీ ప్లాన్ కు అడ్డు వచ్చాడన్న కోపంతో ఎస్ ఐ పైకే కారును ఎక్కించే బరితెగింపునకు పాల్పడిన సంచలన ఉదంతం హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి.
హైదరాబాద్ శివారులోని దుండిగల్ కు సమీపంలోని దూలపల్లిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. దూలపల్లి నుంచి దుండిగల్ మార్గంలో పెట్రోలింగ్ చేస్తున్నారు దుండిగల్ ఎస్ ఐ శేఖర్ రెడ్డి. ఈ క్రమంలో ఒక వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అందుకు సంబంధించిన సమాచారాన్ని పేట్ బషీరాబాద్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సంతోష్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం అర్థరాత్రి 2 గంటల వేళలో అక్కడికి చేరుకున్నారు. అందులోకి వ్యక్తులు ఒక్కసారిగా ఎస్ ఐ మీదకు కారును ఎక్కించే దుస్సాహసానికి తెగబడ్డారు. ఈ అనూహ్య ఘటనను ఊహించని ఎస్ ఐ కింద పడ్డారు. ఆ వెంటనే పైకి లేచిన ఎస్ ఐ తన పెట్రోలింగ్ వెహికిల్ తో ఛేజింగ్ మొదలెట్టారు. సినిమాల్లో మాదిరి సాగిన ఛేజింగ్ కాసేపు సాగింది.
వేగంగా వెళుతున్న దొంగల కారు దూలపల్లి అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఢీ కొనటంతో ఆగిపోయింది. ఆ వెంటనే వాహనంలోని ముగ్గురు దొంగలు.. కారును వదిలేసి అడవిలోకి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. కారును పరిశీలించగా.. అందులో గ్యాస్ కట్టర్.. గడ్డపార.. షట్టర్ లేపే సామాగ్రితో పాటు మారణాయుధాలు లభించాయి.
కారును అనుమానాస్పదంగా గుర్తించిన ప్రాంతంలోని బంగారం షాపులో చోరీకి ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ దొంగల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పోలీసు అధికారికిన వాహనంతో ఢీ కొట్టే బరితెగింపునకు సంబంధించిన వీడియో ఫుటేజ్ తో పాటు.. కారులో పారిపోయిన వైనానికి సంబంధించిన ఫుటేజ్ తో దొంగల్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.