Begin typing your search above and press return to search.

మహేష్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం: తీవ్రంగా గాయపడ్డ దొంగ!

By:  Tupaki Desk   |   29 Sept 2022 4:27 AM
మహేష్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం: తీవ్రంగా గాయపడ్డ దొంగ!
X
తల్లి మరణంతో శోకసంద్రంలో ఉన్న మహేష్ బాబు ఇంట్లో మరో ఉపద్రవం అలుముకుంది. నిన్న తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియల బిజీల్లో ఉన్న మహేష్ బాబు ఇంట్లోకి ఓ దొంగ దొంగతనానికి యత్నించాడు. సీనియర్ నటుడు కృష్ణ, మహేష్ సహా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి ఉన్నారు. అయితే అంతకు ఓ రోజు ముందు ఓ దొంగ ఆయన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించినట్లు వార్తలు ఆలస్యంగా బయటకు వచ్చాయి.

మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 81లో నివాసం ఉంటున్నారు.. తెలిసి వచ్చాడో .. తెలియక వచ్చాడో కానీ.. ఒడిషాకు చెందిన కృష్ణ అనే వ్యక్తి చొరబడే ప్రయత్నం చేశాడు. మంగళవారం రాత్రి ప్రహరి గోడను కృష్ణ అనే వ్యక్తి దాటాడు.

ఈ దూకే ప్రయత్నంలో అతడికి గాయాలయ్యాయి. అక్కడే పడిపోయాడు. శబ్ధం రావడంతో సెక్యూరిటీ వెళ్లి చూడగా.. గాయాలతో పడి ఉన్న వ్యక్తి కనిపించాడు. వెంటనే వాళ్లు పోలీసులకు ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు గాయపడ్డ ఒడిషా వ్యక్తిని హాస్పిటల్ లో జాయిన్ చేసి విచారణ చేశారు.

ఈ దొంగ మూడు రోజుల ముందు హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్న నర్సరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. గాయపడ్డ వ్యక్తి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

మహేష్ బాబు తల్లి అనారోగ్యం, మరణంతో కొద్దిరోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిఘా లేకపోవడం.. ఎవరూ లేరని చూసి ఈ దొంగ దొంగతనం చేసినట్టు ఉన్నారు.

ఇక మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తల్లి మరణంతో గ్యాప్ తీసుకున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.