Begin typing your search above and press return to search.

అమెరికాలో ప్రవాసీలను టార్గెట్ చేసిన దోపిడీ ముఠా..!

By:  Tupaki Desk   |   20 Jan 2023 1:30 PM GMT
అమెరికాలో ప్రవాసీలను టార్గెట్ చేసిన దోపిడీ ముఠా..!
X
అమెరికాలో ఆర్థిక మాంద్యం.. గన్ కల్చర్ పెరిగాక నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈక్రమంలోనే కొందరు అమెరికన్లు ఆ దేశంలోని నివసిస్తున్న ఎఆర్ఐలను టార్గెట్ చేస్తున్నారు.ముఖ్యంగా ఆసియా కమ్యూనిటీ చెందిన వారి ఇళ్లను పక్కా ప్లాన్ తో దోచుకుంటూ హడలెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ముఠానా అమెరికన్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అక్రమ వలసదారులైన జోస్ గొంజాలెజ్ (58).. లిబార్డో సోటో (35).. మెల్బా గైటన్ (53)లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. యూఎస్ లోని ఆసియన్ కమ్యూనిటీకి చెందిన ప్రజల ఇళ్లను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారంగా ఇంట్లోకి చొరబడి డబ్బు.. నగదును దోచుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో ఈ ముఠా 15 వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పక్కా సమాచారంతో జ్యువెలరీ హీస్ట్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. వీరి నుంచి 2.35మిలియన్ డాలర్ల విలువ చేసే ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడారు.

ఈ దొంగల ముఠా ఫ్లోరిడా.. జార్జియా.. నార్త్ కరోలినా నగరాల్లోని ఆసియా కమ్యూనిటీ ప్రజలను టార్గెట్ చేసినట్లు చెప్పారు. ఈ వారంలో టెక్సాన్ లోని ప్లానోలోని ఓ ఇంటిలో దోపిడీకి యత్నిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వీరి దోపీడిలన్నీ కూడా ప్రవాసీలను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు.

ముందుగా ఆసియన్ కమ్యూనిటీకి చెందిన ఇళ్లను గుర్తించి ఆ తర్వాత బలవంతంగా ముందు తలుపు తెరిచి ఇంట్లోని ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఇంట్లోని డబ్బును నగలను దోచుకెళ్లుతుంటారు.

వీరు ఇప్పటి వరకు దోచుకున్న వారంతా కూడా ఆసియన్లేనని పోలీసులు చెబుతున్నారు. నిందితుల ఇళ్లల్లో నుంచి సుమారు 200కే డాలర్ల విలువైన ఆభరణాలు 35000 డాలర్ల నగదును కనుగొన్నట్లు పోలీసులు వివరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.