Begin typing your search above and press return to search.

మా పోలీస్‌ స్టేషన్‌ లో దొంగలు పడ్డారు!

By:  Tupaki Desk   |   15 April 2015 5:51 AM GMT
మా పోలీస్‌ స్టేషన్‌ లో దొంగలు పడ్డారు!
X
ఎవరింట్లో అయినా దొంగలు పడితే... పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి కంప్లైట్‌ ఇస్తారు! మరి పోలీస్‌ స్టేషన్‌ లోనే దొంగలు పడి మొత్తం దోచుకుపోతే అప్పుడేమి చేస్తారు? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చింది? ఏమి చేస్తారు... పక్కనున్న పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేస్తారు. అక్షరాలా ఇదే జరిగింది. చెన్నై మౌంట్‌ రోడ్డులోని తేనాం పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో దొంగలు పడ్డారు. స్టేషన్‌ లో ఉన్న వాకీటాకీలు, విలువైన ఫర్నిచర్‌ తో పాటు కంప్యూటర్లు ఎత్తుకుపోయారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ కు తాళం వేసి ఉందేమో? అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఆ సమయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ స్టేషన్‌ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేనా... ఈ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నది అత్యంత రద్దీ గా ఉండే ప్రాంతంలో కూడా. అయినా కూడా ఆ దొంగల పనితీరుకు అవి అడ్డుకాలేదు. చడీ చప్పుడు లేకుండా మొత్తం దోచేశారు. పొద్దున్నే స్టేషన్‌ కి వచ్చి మొత్తం చూసిన సిబ్బంది విషయం గ్రహించి... గత్యంతరం లేక పక్క పీఎస్‌ లో కంప్లైట్‌ ఇచ్చారు. ఇదీ పరిస్థితి!! దొంగల పనితీరుకు అభినందించాలా... పోలీసుల అలసత్వానికి ఆగ్రహించాలా? మీరే నిర్ణయించుకోండి!.