Begin typing your search above and press return to search.
సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ..ఇంటి దొంగలదే ఆపని!
By: Tupaki Desk | 14 April 2022 3:30 AM GMTబాలీవుడ్ దంపతులు సోనమ్ కపూర్- ఆనంద్ అహుజా ఇల్లు ఫిబ్రవరి లో చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఖరీదైన నగలు..నగదు దొంగలు అపహరిచారు. సుమార్ 2.4 కోట్ల నగదు..ఆభరణాలు కాజేసారు. ఢిల్లీలోని ఆనంద్ ఆహుజా ఉంటోన్న ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆనంద్ కుటుంబ సబ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పెద్దింటి వ్యవహారం కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ ముమ్మరం చేసారు.
గత రెండు నెలలుగా పోలీసులు ఇదే పనిలో ఉన్నారు. తాజాగా ఆ దొంగలు పట్టుబడ్డారు. పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ఇంటి దొంగలే ఈ చోరీకి పాల్పడినట్లు తేల్చారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది? చోరీ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారు? ఘటన ఎలా జరిగింది వంటి వివరాలు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సోనమ్ కపూర్ గర్బీణి కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో సోనమ్ కపూర్ అత్త..ఆనంద్ తల్లిని చూసుకోవడానికి అపర్ణ రూతు అనే కేర్ టేకర్ ని తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అపర్ణ ఎంతో నమ్మకంగా పనిచేసింది. ఇదే సమయంలో ఖరీదైన నగలు..డబ్బు చూసి కళ్లు ఎర్రబడ్డాయి. ఎలాగైనా వాటిని చోరీ చేయాలని భర్త ననరేష్ కుమార్ తో కలిస పన్నాగం పన్నింది. ఫిబ్రవరి 11న అర్ధరాత్ర ఇంట్లో ఎవరు లేని సమయాన్ని అదునుగా భావించి భర్తు ని ఇంట్లోకి పిలిపించి 2.4 కోట్ల నగదు.. ఆభరణాలు కాజేయించింది.
ఆనంద్ కుటుంబ సభ్యులు చోరీ జరగడంతో వెంటనే కేసు ఫైల్ చేసారు. అపర్ణ మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా యధావిధిగా రెండు నెలలుగా పనిలోకి వస్తూనే ఉంది. ఎక్కడా సందేహం రాకుండా జాగ్రత్త పడింది. ఎవరో కాజేసారంటూ కుటుంబ సభ్యులతో పాటు బాధపడినట్లు నటించింది. సోనమ్ నేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిదర్యాదు చేయడంతో కాఖీలు విచారణ ఇంటి మనుషుల దగ్గర నుంచి ప్రారంభించడం మొదలు పెట్టాయి.
ముందుగా ఇంట్లో పని మనుషుల నుంచి విచారణ మొదలై చివరిగా అపర్ణ ఇంటికి వెళ్లే సరికి అసలు దొంగ ఎవరు? అన్నది పట్టుబడింది. అపర్ణ ఇంట్లోనే చోరీకి గురైన నగులు..డబ్బు దొరికింది. వెంటనే పోలీసులు అపర్ణ..నరేష్ లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటకు వచ్చింది. దీంతో సోనమ్ కుటుంబ సబ్యలు షాక్ అయ్యారు.
తిన్న ఇంటి వాసల్నే లెక్కపెట్టే రకమైన అపర్ణని ఇంట్లో నుంచి గెంటేసారు. ప్రస్తుతం ఆ దంపతులు ఇద్దరు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఇదంతో హిందీ క్రైమ్ సీరియల్ మాదిరి సాగింది. ఇటీవలి కాలంలో యూ ట్యూబ్ ..ఫేస్ బుక్ ఇలాంటి వీడియోలు వైరల్ గా మారుతోన్న సంగతి తెలిసిందే.