Begin typing your search above and press return to search.
రోజా ఇంట్లో చోరీ..16లక్షల బంగారం మాయం!
By: Tupaki Desk | 22 Jan 2018 11:53 AM GMTసినీనటుడు - కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇంట్లో నుంచి దాదాపు రూ. 16 లక్షల నగదు దొంగతనానికి గురైన ఘటన కొద్ది రోజుల క్రితం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చిరు వంటి సెలబ్రిటీ ఇంట్లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో డబ్బు దొంగతనానికి గురి కావడం వెనుక ఇంటి దొంగ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆ ఇంట్లో 10 సంవత్సరాలుగా పని చేస్తున్న చెన్నయ్య అనే పనిమనిషి ఈ దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో చిరు కుటుంబం షాక్ కు గురైంది. తాజాగా, అదే తరహాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో కూడా భారీ చోరీ జరిగింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న రోజా ఇంటి నుంచి రూ.10లక్షలు విలువైన బంగారం - వెండి ఆభరణాలు దొంగతనానికి గురవడం కలకలం రేపింది.
తన ఇంట్లో దొంగతనం జరిందని రోజా....మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మాదాపూర్ డీసీపీ ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. అత్యంత కట్టుదిట్టమై భద్రత ఉన్న రోజా ఇంట్లోని బీరువాలో ఉన్న విలువైన హారం దొంగతనానికి గురవడం పై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఇంటిదొంగ పనా....లేక బయటివాళ్ల పనా....అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉన్న సమయంలోనే దుండగులు ఆ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నామని, విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.