Begin typing your search above and press return to search.
న్యూజెర్సీలోని ఇండియన్ జ్యువెల్లరీ షాప్ దోపిడీ వీడియో వైరల్
By: Tupaki Desk | 29 Nov 2022 6:35 AM GMTభారతీయ బంగారం దుకాణాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ముసుగులు వేసుకొచ్చి మరీ రాత్రిళ్లు అందరూ చూస్తుండగానే దోపిడీకి పాల్పడుతున్నారు. జనాల రాకపోకలు ఉన్నప్పుడే రాత్రి 8 గంటల ప్రాంతంలో తాజాగా దోపిడీ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. న్యూజెర్సీ సిటీలో ఈ జ్యువెల్లరీ షాప్ దోపిడీలో దాదాపు అర మిలియన్ డాలర్ల విలువైన నగలు $ 20,000 నగదుతో కూడిన బ్యాగ్‌ను అపహరించిన దొంగల కోసం పోలీసులు శోధిస్తున్నారు.
ఒక కార్మికుడిని తుపాకీతో దోపిడీ దొంగలుతలపై కొట్టాడు. సీసీటీవీ వీడియో పని చేయకుండా చేశారు. దుకాణంలోని కస్టమర్లు దోపిడీని రికార్డ్ చేయడంతో ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 4:30 గంటల తర్వాత జరిగింది. 787 నెవార్క్ అవెన్యూ వద్ద సారా జ్యువెలరీలో ఈ దోపిడీ జరిగింది.
మాస్క్‌లు ధరించిన ఐదుగురు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించి నగలను లాక్కోవడానికి ప్రయత్నించారు. డిస్‌ప్లే కేసులను పగులగొట్టేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
ప్రజలు అటుగా వెళుతున్నప్పటికీ, ఈ దొంగలు ఎటువంటి ఆందోళన చెందకుండా నిర్భయంగా యథేచ్ఛగా దొంగతనం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రశాంతంగా దుకాణం నుండి బయటికి వెళ్లి బయట వారి కోసం వేచి ఉన్న రెండు వాహనాల్లో ఎక్కారు.
కౌంటర్ వెనుక ఉన్న మహిళలను బలవంతంగా నేలపైకి పడుకోమన్నారు. ఒకరిపై దాడి చేశారు. ఆ సమయంలో స్టోర్‌లో 3 ఏళ్ల చిన్నారితో సహా ఇద్దరు కస్టమర్లు ఉన్నారు.
తలుపు తెరిచినప్పుడు మొదటి అనుమానితుడు కస్టమర్‌ను లోపలికి నెట్టి మరీ లోపలికి ప్రవేశించాడు. స్టోర్ యజమాని భార్య నైలా అక్బరీని నేలపై పడుకోమని ఆదేశించినట్లు చెప్పారు. నేరం సమయంలో తుపాకీ బయటకు తీసి అందులో పనిచేసే కార్మికులను బెదిరించారు. ఇది భయాన్ని పెంచింది.
లాకర్లు తెరవండి, లేకపోతే నేను నిన్ను కాల్చివేస్తాను' అని దొంగలు బెదిరించినట్టు బాధితులు తెలిపారు. బంగారం షాప్ లోని ఉద్యోగులిద్దరూ అల్లాడిపోయారు కానీ తమను కాల్చిచంపలేదని వారి తెలిపారు.
స్టోర్ యజమాని దానిలో $ 20,000 డాలర్ల నగదు ఉన్న బ్యాగ్‌తో పాటు సుమారు $ 480,000 నగలు తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. దొంగలు వచ్చి, ఏది సులభమైన లక్ష్యమో తనిఖీ చేశారని తర్వాత దోపిడీ చేశారని యజమాని అంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.