Begin typing your search above and press return to search.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ .. రంగంలోకి టాస్క్ ఫోర్స్ , రూ.1 ఎక్కువ వేసినా లైసెన్స్ రద్దు !
By: Tupaki Desk | 21 May 2021 10:30 AM GMTకరోనా వైరస్ పేరుతో అడ్డగోలుగా ఫీజులు వేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స కి లక్షల్లో బిల్లులు వేస్తూ, బిల్లు కడితేనే పేషెంట్ ను డిశ్చార్జీ చేస్తామని మొండిగా వ్యవహరించే ఆసుపత్రులపట్ల కొరడా ఝుళిపించేందుకు టాస్క్ ఫోర్స్ ప్రణాళికలరు రచిస్తోంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను కూడా జతచేసింది. ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం కాకుండా వైద్య సౌకర్యాలకు అదనంగా ఛార్జీలు విధిస్తే వెంటనే కాల్ చేసి వివరాలు చెప్తే చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
కరోనా బారిన పడిన పేషెంట్ల ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల బిల్లులు కట్టలేక అనేక ఆర్ధిక సమస్యల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది. అలాంటి వారికోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలలోని ఏ ప్రయివేట్ హాస్పిటల్ లో అయినా అధిక బిల్లులు వేస్తే వెంటనే ఈ ఫోన్ నంబర్లకు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం జీవోను కూడా జారీ చేరింది. తెలంగాణ ప్రభుత్వ జీవో నంబర్ 248 ప్రకారం ప్రయివేట్ హాస్పిటల్స్ వేయాల్సిన వివిధ ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. ఒక రోజుకు వేయాల్సిన ఛార్జీల వివరాలు. సాధారణ బెడ్ ఒకరోజుకు 4000 వేల రూపాయలు, బెడ్ ఆక్సీజన్ తో కలిపి 6500 రూపాయలు, వెంటిలేటర్ తో పాటు బెడ్ సౌకర్యం కలిపిస్తే 9000వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్థారించింది. ప్రభుత్వం నిర్ధారించిన ఛార్జీల కన్నా ఒక్క రూపాయి అదనంగా వేసినా ప్రయివేటు ఆసుపత్రుల తాట తీస్తామంటున్నారు విజిలెన్స్ అధికారులు. టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా అధిక ఛార్జీలు వేస్తున్న ప్రయివేట్ ఆసుపత్రులపై స్టింగ్ ఆపరేషన్ చేసి మోసాలకు పాల్సడుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం అని అంటున్నారు.
ఇకపోతే , ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ నంబర్లను ఒకసారి చూస్తే .... సీఎం క్యాంపు ఆఫీస్ నెంబర్ : 04023403999. ఆరోగ్య శాఖకు సంబంధించి డిఏంహెచ్ ఓ సెల్ నెంబర్: 9705462662, ఆర్ డి ఓ సెల్ నెంబర్ 7680906650, డీపీవో సెల్ నెంబర్ : 99491865049, డ్రగ్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ : 9704199455, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ సెల్ నెంబర్ : 9849766789.