Begin typing your search above and press return to search.

అల్లుడిగారికి మరో నోటీసు దెబ్బ పడిందండోయ్

By:  Tupaki Desk   |   22 Jun 2016 7:04 AM GMT
అల్లుడిగారికి మరో నోటీసు దెబ్బ పడిందండోయ్
X
అత్తగారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న వేళ.. బావమరిది దేశంలో లేని వేళ.. ఒక బావమరిదికి ఇలాంటి తలనొప్పులు తెర మీద రావటం ఇబ్బందికరమే. ఇప్పటికే భూదందాల మీద విచారణ.. కేసులు బుక్ అయి కిందామీదా పడుతున్న వేళ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి తాజాగా వచ్చిన నోటీసులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను చిరాకు పుట్టిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. తాజాగా స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయటం.. సంస్థకు చెందిన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తమకు అందించాలనటం ఇబ్బంది కలిగించే అంశమే.

రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో గతంలో రాబర్ట్ వాద్రా 110 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అంత భారీ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిటే ‘అల్లుడుగారు’ కొనుగోలు చేయటం గమనార్హం. ఇంత భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేయటానికి అవసరమైన నిధుల వ్యవహారంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే సమయంలో అక్కడి స్థానిక తహశీల్దార్ చేసిన కంప్లైంట్ తో రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. దాని ఆధారంగానే తాజాగా నోటీసులు ఇచ్చిందని చెబుతున్నారు. ఇటీవల స్కైలైట్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే.. అల్లుడుగారికి టైం ఇప్పుడు ఏ మాత్రం బాగోనట్లుగా అనిపించట్లేదు..?