Begin typing your search above and press return to search.
బావమరిదిని దెబ్బేసేలా బావ.. ఇప్పుడీ ఎంట్రీ ఏంది సామి?
By: Tupaki Desk | 8 Sep 2022 8:21 AM GMTకాంగ్రెస్ పార్టీకి ఏదైనా శాపం ఉందా? అన్న సందేహం ఇటీవల చోటు చేసుకునే పరిణామాల్ని చూసినప్పుడు కలుగక మానదు. పార్టీకి కాస్తంత సానుకూలత వస్తుందన్న సమయంలోనే సొంత పార్టీ నేతలు చేసే చేష్టలతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే దుస్థితి. తాజాగానే తీసుకుంటే.. దేశ చరిత్రలో తొలిసారి ఒక జాతీయ నాయకుడు (రాహుల్ గాంధీ) ఐదు నెలల పాటు దేశం మొత్తాన్ని కాలినడకన నడవనున్నారు.దీనికి జోడో యాత్రగా పేరు పెట్టారు. అలా అని దేశం మొత్తం కాదు కానీ.. దేశంలోని అన్ని రాష్ట్రాల్ని కవర్ చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఆరంభంలోనే రాహుల్ గాంధీ నెత్తి మీదకు కొత్త సమస్య తీసుకొచ్చారు ఆయన బావమరిది రాబర్ట్ వాద్రా.
రాహుల్ సోదరి ప్రియాంక భర్తగా సుపరిచితుడైన ఆయన.. యూపీఏ ప్రభుత్వంలోనూ ఆయన పుణ్యమా అని.. పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంది. మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. రాబర్ట్ వాద్రా పేరు పెద్దగా బయటకు రాలేదు.
వార్తలకు దూరంగా ఆయన ఉండటం షురూ చేశారు. బావమరిది పాదయాత్ర చేస్తున్న వేళలో.. ఆయన భారత్ జోడో యాత్ర పేరుతో పోస్టర్లను ట్విటర్ లో షేర్ చేశారు. ఇది కాస్తా ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. దీనికి కారణం సదరు పోస్టర్ లో ఆయన ఫోటో కూడా ఉండటమే దీనికి కారణం.
భారత్ జోడాయాత్రలో వాద్రా కలవటం ఫన్నీగా ఉందని.. ఇప్పుడాయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడగలనని అనుకుంటున్నారా? అంటూ బీజేపీ నేతలు ఎక్కెసం చేస్తున్నారు. ఇంతకూ వాద్రా చేసిన ట్వీట్ కు జత చేసిన పోస్టర్ లో ప్రియాంక.. రాహుల్.. పక్కనే రాబర్ట్ వాద్రా ఉండటం.. వారిపైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఉంది. ఇదే పోస్టర్ లో స్పానర్స్ జేడీ అభిజిత్ ఫోటో ఉంది. అతను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ విభాగం నేతగా పని చేశారు.
యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రా వ్యవహారశైలిపై పలు విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వరుస ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ కు.. తన కారణంగా మరో సమస్యను తెచ్చి పెట్టకూడదన్న విషయాన్ని మర్చిపోయి.. బావమరిది పాదయాత్ర వేళ.. బావ పోస్టు చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. పలువురు నెటిజన్లు వాద్రా పోస్టర్ మీద నెగిటివ్ గా రియాక్టు అయ్యారు.
ఇప్పటివరకు పార్టీ విషయాల్లో నేరుగా తలదూర్చినట్లుగా కనిపించకుండా వ్యవహారాలు చెక్కబెడతారన్న పేరున్న వాద్రా.. ఇప్పుడు ట్వీట్ తో బయటకు రావటం సరైనది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ పాదయాత్ర వేళ.. ఇలాంటి ఉదంతాలు ఆ పార్టీని ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.