Begin typing your search above and press return to search.
రాబిన్ శర్మ...ఇదేమి ఖర్మ....ఎవరంటున్నారంటే...?
By: Tupaki Desk | 25 Nov 2022 2:30 PM GMTఆయన పీకే టీం మెంబర్ గా ఉంటూ ప్రధానిగా మోడీ తొలిసారి గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కి చెందిన వారే రాబిన్ శర్మ. అయితే రాబిన్ శర్మ సక్సెస్ రేట్ మీదనే ఇపుడు టీడీపీలో చర్చ సాగుతోంది. పీకే టీం సక్సెస్ చాలా ఉంది. చెప్పుకోవడానికి కూడా ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు కనిపిస్తాయి.
అయితే ఆయా రాష్ట్రాల అధినేతలు జనాకర్షణ కలిగిన వారు కావడం ప్లస్ పాయింట్. అలాగే జనాల్లో వారి పట్ల ఆదరణ ఉండడం మరో పాయింట్. ఇలా ఎన్ని ఉన్నా కూడా ఆయా పార్టీల అధికార విజయంలో దాని వాటిలో పీకే పాత్ర ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి ట్రాక్ రికార్డు రాబిన్ శర్మకు ఉందా అంటే చెప్పలేమనే అంటున్నారు.
ఆయన్ని ఏరి కోరి మరీ చంద్రబాబు నియమించుకున్నారు. ఆయన ఏమి చెబితే అది చేస్తున్నారు. ఆయన మాటను బాబు కచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెబుతున్నారు. ఇక రాబిన్ శర్మ టీడీపీ వ్యూహకర్త బాధ్యతలు తీసుకున్నాక బాదుడే బాదుడు అన్న కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఇది పెద్దగా హిట్ అయినది లేదు. తొలినాళ్ళలో ఎంతో కొంత హడావుడి కనిపించినా ఆ మీదట చడీ చప్పుడు లేకుండా పోయింది.
మరో వైపు చూస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ధరలు పెరగడం సహజం. అవి ఏ ఏటికి ఏ ఏడు పెరుగుతూ ఉంటాయి. అది సహజమైన ప్రక్రియ. అందువల్ల దాన్ని అంత సీరియస్ సబ్జెక్ట్ గా జనాలు తీసుకోలేదని, అలాంటి దాని మీద అతి పెద్ద కార్యక్రమం డిజైన్ చేయడం ద్వారా రాబిన్ శర్మ పార్టీకి పొలిటికల్ మైలేజ్ సాధించింది లేదు అనే అంటున్నారు.
ఇపుడు ఆయన ఇదేమి ఖర్మ అంటూ మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ ఖర్మ అని అన్నపుడల్లా నెగిటివిటీయే కనిపిస్తోంది. ఇది జనాల్లోకి వెళ్తే మాకేంటి ఈ ఖర్మ అని ఎవరికి వారు అనుకుంటే టీడీపీ ఇచ్చే అసలైన సందేశం కనుమరుగు అవుతుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే రాబిన్ శర్మ తీసుకొస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా తమ్ముళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి జనాల్లోకి వెళ్లాల్సినవిగానే ఉంటున్నాయిట.
అసలే మూడున్నరేళ్ళుగా అధికారానికి దూరమై అన్ని విధాలుగా అప్పులు చేస్తూ ఆరిపోయిన తమకు పెను భారాలు ఇలా పెట్టడమేంటి అని తమ్ముళ్ళు మండుతున్నారు. ఇదేమి ఖర్మ అన్న పేరే తమ్ముళకు చాలా మందికి నచ్చడంలేదుట. కానీ చంద్రబాబు మాత్రం శర్మ గారి వ్యూహం భేష్ అంటూ జనంలోకి వెళ్లాల్సిందే అని అంటున్నారుట.
నిజానికి తెలుగుదేశం పార్టీ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు అనేక కార్యక్రమాలు చేసింది. వాటికి మంచి పేర్లు కూడా పెట్టింది. మీకోసం మళ్లీ వస్తున్నా అన్న టైటిల్ తో బాబు వెళ్తే జనాలు నీరాజనాలు పట్టారు. అలాంటిది ఈ ఖర్మ టైటిల్ ఏంటి మా ఖర్మ కాకపోతేనూ అని తమ్ముళు మండుతున్నారుట.
పైగా ఖర్మ అంటే అది జనాల సెంటిమెంట్ అని అలాంటి దాంతో రాజకీయాలు చేయడం తగదని, అది బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. ఇక సీనియర్ నేతలు అనేక పేర్లు సూచించినా చంద్రబాబు మాత్రం ఇదేమి ఖర్మకే ఓటేశారు. దాంతో తమకు రాబిన్ శర్మతో ఇదేమి ఖర్మరా అని తమ్ముళ్ళు అనుకునే పరిస్థితి ఉంది అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే రాబిన్ శర్మ పార్టీని విజయపధంలో నడిపించగలడా అన్న సందేహం కూడా సీనియర్లలో ఉందిట. ఆయన స్థానిక సమస్యలను ఎంతమేరకు అవగాహన చేసుకున్నారు అన్న చర్చ కూడా వస్తోందిట. అలాగే ఆయనకు ఏపీ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది అని కూదా ఎక్కువ మంది తమ్ముళ్ళు నమ్మడంలేదుట. చంద్రబాబు మాత్రం రాబిన్ శర్మ తిరిగి సీఎం సీట్లో కూర్చోబెడతారు అని భావిస్తున్నారుట. చూడాలి మరి శర్మ ఖర్మ అవుతారా. లేక దశ తిరిగేలా చేస్తారా అన్నది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.