Begin typing your search above and press return to search.

సర్జరీల పిచ్చోడు.. ఒళ్లంతా గ్రాఫిక్సే

By:  Tupaki Desk   |   2 Aug 2016 4:00 AM IST
సర్జరీల పిచ్చోడు.. ఒళ్లంతా గ్రాఫిక్సే
X
బార్బీ బొమ్మకు మగవేషం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడాయన.. పుట్టుకతో బొమ్మ రూపం లేదు.. పదకొండేళ్లలో 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని అలా మారిపోయాడు. బ్రెజిల్ కు చెందిన ఈయన పేరు రోడ్రిగ్ ఆల్వ్స్. రూపం మార్చుకోవడమే పనిగా ఆయన ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయించుకున్న ఈ ఆపరేషన్ పిచ్చోడు ఇప్పటివరకు 3.5 లక్షల పౌండ్లు ప్లాస్టిక్ సర్జరీల కోసం ఖర్చు చేశాడు. ముక్కుకే ఏకంగా 7 సర్జరీలు చేయించుకున్నాడు. చివరకు అది తేడా కొట్టింది కూడా. ఇప్పుడు ముక్కు కండరాల్లో మృతకణాలు ఎక్కువవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అయినా.. రోడ్రిగ్ కు సర్జరీలపై ఏ మాత్రం బాధ లేదట. మళ్లీ ఏదైనా సర్జరీ అవసరమైతే ఎలా అనుకుంటూ టోటల్ గా తన బాడీకి 10 లక్షల పౌండ్లకు ఇన్స్యూర్ చేయించాడు.

తాజా సర్జరీ తరువాత ఏకంగా అతని ముక్కుకు ఇన్ ఫెక్షన్ సోకి కణజాలాన్ని మొత్తం కొరికేస్తోంది. అలాగే వదిలేస్తే ఏకంగా మొఖమంతా కొరికేసే పరిస్థితి వస్తుందని చెప్పిన వైద్యులు 40 వేల పౌండ్లు ఖర్చు చేసి మరో ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో రోడ్రిగ్ ఇన్స్యూరెన్సు చేయించుకున్నాడు.

అయితే.. దెబ్బతిన్న ముక్కును సరిచేయడానికి పక్కటెముకుల వద్ద కండరాలను కోసి ముక్కును మళ్లీ సృష్టించారట వైద్యులు. ఈ సర్జరీల పిచ్చోడు చివరికి ఏమవుతాడో ఏమో చూడాలి.