Begin typing your search above and press return to search.
క్రికెట్ ఎన్నికల్లోకి అరుణ్ జైట్లీ కుమారుడు
By: Tupaki Desk | 8 Oct 2020 5:30 PM GMTకేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీకి ఓ కీలక పదవి వరించబోతోంది. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీ) ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో అరుణ్ జైట్లీ కుమారుడు నిలవబోతున్నారు. ఈ మూరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్ దాఖలు చేయడం విశేషంగా మారింది.
ఇక సభ్యులంతా ఆయనకే మద్దతు తెలుపుతుండడంతో ఎన్నికల లాంఛనం పూర్తి కానున్నట్లు సమాచారం. ఇక తండ్రి అరుణ్ జైట్లీలాగానే రాజకీయాల్లోకి వస్తున్న కుమారుడు రోహాన్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ట్విట్టర్ లో విషెస్ తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని.. డీడీసీఏను అభివృద్ధి చేయాలని కోరాడు. ఇక రోహాన్ ఎన్నికకు తాము సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు.
ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేశారు. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధీర్ఘ కాలం సేవలందించారు.
తాజాగా ఆయన సేవలకు గుర్తుగా డీసీఏ జైట్లీ మరణానంతరం ఢిల్లీలోని ఫిరోజ్ సా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించారు. తండ్రి వారసత్వంతో ఇప్పుడు రోహాన్ అదే ఢిల్లీ క్రికెట్ పదవికి నామినేషన్ వేయడం గమనార్హం. ఆయనకు ఎవరూ అభ్యంతరం తెలుపకపోవడంతో ఎన్నిక లాంఛనమే కానుంది.