Begin typing your search above and press return to search.
అక్కడి హిందూ రోహింగ్యాల గొంతులు కోసేశారు
By: Tupaki Desk | 28 Sep 2017 9:38 AM GMTహిందూ రోహింగ్యాల మీద దాడి మయన్మార్ లో అంతకంతకూ పెరిగిపోతోంది. ఆ బుల్లి దేశంలో హిందూ రోహింగ్యాలను వరుసపెట్టి చంపేసిన దారుణ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. సామూహికంగా గొంతులు కోసేసి.. పూడ్చి పెట్టేసిన దారుణం ఒకటి బయటకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
గడిచిన వారం రోజులుగా మయన్మార్ సైనికులు జరిగిన దారుణ ఉదంతాన్ని గుర్తించి పూడ్చి పెట్టిన మృతదేహాల్ని బయటకు వెలికి తీస్తున్నారు. మయన్మార్ లోని ఉత్తర రఖైన్ లోని ఖా మౌంగ్ షేక్ అనే గ్రామంలో 45 మంది హిందూ రోహింగ్యాల మృతదేహాల్ని అక్కడి వారికి అప్పజెప్పారు. కొద్దిరోజుల క్రితం ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ పేరుతో ఒక ముస్లిం తీవ్రవాద సంస్థ కార్యకర్తలు హిందూ రోహింగ్యాల్ని పట్టుకొని.. వారందరిని నిలబెట్టి అనంతరం గొంతులు కోసేశారు. ఆ తర్వాత సామూహికంగా గోతుల్లో పూడ్చి పెట్టారు.
పిల్లలు.. పెద్దలు.. వృద్ధులు అన్న తేడా ఏమీ లేకుండా అందరిని దారుణంగా.. అమానుషంగా చంపేశారు. తాజాగా ముస్లిం తీవ్రవాదన సంస్థ జరిపిన దారుణకాండను మయన్మార్ సైన్యం తాజాగా మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకొని జరిగిన తీసుకెళ్లి చూపించింది. ఇక.. అక్కడి స్థానికులు మాట్లాడుతూ జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చారు. ఇంట్లో వాళ్లను బలవంతంగా తీసుకెళ్లి.. కిరాతకంగా గొంతులు కోసి చంపేసినట్లుగా అక్కడి వారు చెప్పారు.
తమ కళ్ల ముందే తమ వాళ్లను చంపేశారని.. ఆ తర్వాత గోతులు తీసి సామూహికంగా పూడ్చేసినట్లుగా వారు చెప్పుకొచ్చారు. జాతిశుద్ధి పేరుతో రెండు నెలల క్రితం సైనిక చర్య మొదలైంది. ఆ తర్వాత మీడియాను అనుమతించింది తాజాగానే. తమ కళ్ల ముందు జరిగిన ఊచకోతను చెప్పిన ఒక మహిళ.. దాదాపు 5 లక్షలకు పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయినట్లుగా వెల్లడించారు. కేవలం ఏడాది వ్యవధిలో తీవ్రవాదుల చేతుల్లో 163 మంది మరణించగా.. 91 మంది గల్లంతయ్యారు. ఈ వివరాల్ని మయన్మార్ సైన్యం వెల్లడించింది. ఇదిలా ఉండగా ముస్లిం రోహింగ్యాల ప్రాబల్యం ఉన్న 200 గ్రామాలు కాలిపోగా.. 4.2లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్లినట్లుగా సైన్యం వెల్లడించింది.