Begin typing your search above and press return to search.

కోర్టుకు పాకిన్ వైర‌స్‌.. జ‌డ్జికి పాజిటివ్‌: కోర్టంతా శానిటైజ్‌

By:  Tupaki Desk   |   3 Jun 2020 10:10 AM GMT
కోర్టుకు పాకిన్ వైర‌స్‌.. జ‌డ్జికి పాజిటివ్‌: కోర్టంతా శానిటైజ్‌
X
దేశంలో మ‌హ‌మ్మారి వైర‌స్ కొత్త కొత్త ప్రాంతాల్లో పాకుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌, ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌లువురికి వైర‌స్ సోకింది. ఇప్పుడు న్యాయ‌స్థానాల‌కు కూడా ఆ వైర‌స్ పాకుతోంది. వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో న్యాయ‌స్థానాల్లో కేవ‌లం ఆన్‌లైన్‌లో కేసుల విచార‌ణ జ‌రుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రోహిణి కోర్టుకు ఈ వైర‌స్ వ్యాప్తి చెందింది. ఆ కోర్టులోని జ‌డ్జికి పాజిటివ్ తేలింది. దీంతో న్యాయ‌స్థానం ఉలిక్కిప‌డింది. దీంతో న్యాయ‌వాదుల‌తో పాటు ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నాయి. వాస్త‌వంగా జడ్జి భార్యకు మొద‌ట వైర‌స్ సోకింది. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే వారి కుటుంబ‌స‌భ్యులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంలో భాగంగా జ‌డ్జికి కూడా ప‌రీక్ష‌లు చేశారు. ఆ పరీక్షల్లో అత‌డికి వైర‌స్ సోకింద‌ని వైద్యులు నిర్ధారించారు.

జ‌డ్జితో పాటు అత‌డి భార్య క్వారంటైన్ కు వెళ్లారని రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహవీర్ సింగ్ తెలిపారు. జడ్జికి కరోనా ఉందనే వార్త న్యాయ‌స్థానాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైర‌స్ సోకిన విష‌యం తెలిసిన వెంట‌నే న్యాయ శాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రోహిణి కోర్టు స‌ము‌దాయ భ‌వనాన్ని మూసేసి మొత్తం శానిటైజ్ చేశారు. ఈ ఈ క్ర‌మంలోనే వైర‌స్ సోకిన జడ్జితో సన్నిహితంగా ఉన్న నలుగురు జడ్జిలకు నిర్ధార‌ణ పరీక్షలు నిర్వహించారు. అనుమానితులకు వైద్య పరీక్షలు చేశారు. వారి ప‌రీక్ష‌ల ఫ‌లితం తెలియాల్సి ఉంది. వారి రిపోర్టుల కోసం న్యాయ‌వాదులు ఎదురుచూస్తున్నారు. వారికి వైర‌స్ సోకి ఉంటే మొత్తం న్యాయ‌స్థానం మూసేసే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో కోర్టుకు రావాలంటేనే న్యాయవాదులు, ఇతర జడ్జిలు, కక్షిదారులు జంకుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశంలోనే కేసుల‌ప‌రంగా ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఢిల్లీలో మొత్తం కేసులు 22,132 కు చేరాయి.