Begin typing your search above and press return to search.
నా కొడుకును చంపేసి ఊరేశారు
By: Tupaki Desk | 26 Jan 2016 11:55 AM GMTదేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ మరణంపై ఆయన తండ్రి మణికుమార్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదని..ఎవరో చంపేసి ఊరి వేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. తన కొడుకు మృతి మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తన కొడుకు మరణంపై న్యాయం కావాలే తప్పించి.. పరిహారం అక్కర్లేదని తేల్చిన అతను.. తన భార్యకు విడాకులు ఇచ్చినా.. కొంతకాలానికే కలిసి ఉంటున్నట్లు పేర్కొన్నారు. తాము వడ్డెర కులానికి చెందిన వాళ్లమని.. తాను పెళ్లి చేసుకునే సమయంలోనూ తన భార్య వడ్డెర కులానికి చెందిన అమ్మాయిగా చెబితే పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పారు.
తాము వడ్డెర కులానికి చెందినప్పటికీ..తన భార్య ఎస్సీ అని చెప్పటం తనకు అర్థం కావటం లేదన్న ఆయన.. ఈ కులాల గొడవేందంటూ అసహనం వ్యక్తం చేశారు. కులం కంటే కూడా మతం మారితే సరిపోయేదన్న ఆయన.. బీసీ కింద ఉన్నామని.. మతం మార్చుకుంటే సరిపోయేది కదా అంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. రోహిత్ మరణంపై రాజకీయం చేస్తున్నారని.. కులాల కుమ్మలాటలు ఆపేసి.. కొడుకు మరణంపై న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. మరి.. రోహిత్ ను దళితుడిగా అభివర్ణిస్తూ ఆందోళన చేస్తున్న నేతలు.. రోహిత్ తండ్రి మాటలపై ఎలా రియాక్ట్ అవుతారో..?