Begin typing your search above and press return to search.
వైజాగ్ టెస్ట్ మ్యాచ్ః భారత బ్యాట్స్ మెన్ విజృంభణ!
By: Tupaki Desk | 3 Oct 2019 6:57 AM GMTవిశాఖ వైఎస్ ఆర్ స్టేడియం వేదికగా దక్షిణాప్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత బ్యాట్స్ మన్ విజృంభించి ఆడుతున్నారు. తొలి రోజే భారత ఆటగాళ్లు దూకుడైన బ్యాటింగ్ చేశారు. అయితే టీ విరామం తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆ తర్వాత మ్యాచ్ జరగలేదు. రెండో రోజు ఉదయం తొలి సెషన్లో కూడా ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ దూకుడు కొనసాగుతూ ఉంది.
ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో కొత్త ఓపెనింగ్ పెయిర్ తో ఇండియా బరిలోకి దిగింది. సీనియర్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ - యంగ్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ టెస్టుల్లో తొలి సారి ఓపెనర్ గా బరిలోకి దిగాడు.తొలి మ్యాచ్ లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మొత్తం నూటా డెబ్బై ఆరు పరుగులు చేసి..వేగంగా ఆడే క్రమంలో రోహిత్ ఔట్ అయ్యాడు. ఇక మయాంక్ అగర్వాల్ రెండో రోజుకు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ తో పోలిస్తే కాస్త జాగ్రత్తగా ఆడుతూ.. ఈ యువ ఆటగాడు ఓపెనర్ గా సక్సెస్ అయ్యాడు. ఒక్క వికెట్ నష్టానికి మూడు వందల ఇరవై పరుగుల పై స్థాయి స్కోరుతో టీమిండియా ఈ మ్యాచ్ పై పట్టు బిగిస్తూ ఉంది.
తదుపరి ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే.. చెప్పలేం కానీ, లేకపోతే ఈ మ్యాచ్ టీమిండియా గుప్పిట్లో ఉన్నట్టే. అయితే వికెట్ పూర్తిగా ఫ్లాట్ గా ఉండటంతో.. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావితం చేస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం.