Begin typing your search above and press return to search.
టీమిండియా టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ.. కివీస్ తో జట్టు ఇదే
By: Tupaki Desk | 9 Nov 2021 3:18 PM GMTప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన టీమిండియాను బీసీసీఐ ప్రక్షాళన చేసింది. తాజాగా టీం ఇండియా టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. వైఎస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించారు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఉండనున్నాడు.
న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కు బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ తో ద్రావిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే కోచ్ ద్రావిడ్, బీసీసీఐ పెద్దలు కలిసి ఈ కీలక జట్టను ఎంపిక చేశారు.
స్వదేశంలో ఈనెల 17 నుంచి న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్ అనుకున్నట్టే ప్రకటించడం విశేషం. ఈ సిరీస్ కు కెప్టెన్ గా నిన్నటి వరకు చేసిన విరాట్ కోహ్లీని పక్కనపెట్టేయడం సంచలనమైంది.
ఇక ఐపీఎల్ లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వైడ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ లాంటి యువకులకు అవకాశం కల్పించింది. ఇక వీరితోపాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, సిరాట్ లతో కూడిన జట్టును ప్రకటించింది.
మొత్తంగా ఐపీఎల్ లో అదరగొట్టిన వారికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో చోటు దక్కడం విశేషం. మరి ఈ టీం ఎలా రాణిస్తుందనేది వేచిచూడాలి.