Begin typing your search above and press return to search.
రోహిత్ 30 కోట్ల ఫ్లాట్ వెనుక అదీ మేటర్
By: Tupaki Desk | 13 Aug 2015 9:00 AM GMTఓ క్రికెటర్ భారత జట్టుకు ఆడుతున్నాడు అతడి రేంజే వేరుగా ఉంటుంది? టీమ్ ఇండియాలో అడుగుపెట్టడం ఆలస్యం.. అతను కోటీశ్వరుడైపోతాడు. అందులోనూ ఐపీఎల్ వచ్చాక దేశవాళీ క్రికెటర్ అయినా సరే ఒక్క మ్యాచ్ లో మెరుపులు మెరిపిస్తే చాలు.. తర్వాతి సీజన్ కల్లా కోటీశ్వరుడైపోవచ్చు. ఇక రోహిత్ శర్మ లాంటి క్రికెటర్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అతను వందల కోట్లలో సంపాదించి ఉంటాడు. కాబట్టి ఓ 30 కోట్లు పెట్టి అతను ముంబయిలో ఫ్లాట్ కొనడం పెద్ద మేటర్ ఏమీ కాదు. కాకపోతే 30 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే విశేషం కాదు కానీ.. ఓ ఫ్లాట్ కోసం అతను రూ.30 కోట్లు పెట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే ఫ్లాట్ కు ఎన్నో విశిష్టతలున్నాయి. దానికి వెనుక ఆ ఆసక్తికరమైన కథ కూడా ఉంది.
ముంబయిలో బాంద్రా-వర్లి ప్రాంతం అంటేనే చాలా రిచ్. అక్కడ ఓ మామూలు ఫ్లాట్ కొనాలన్నా కోట్లు పెట్టాల్సిందే. రోహిత్ ప్రస్తుతం ఫ్లాట్ కొన్నది ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్‌లో. 29వ అంతస్తులోని అతడి ప్లాట్‌లో నాలుగు బెడ్ రూమ్‌లు ఉన్నాయి. చాలా విశాలమైన ఫ్లాట్ అది. ఫ్టాట్ నుంచి సముద్రం చాలా దగ్గర. అక్కడి నుంచి 270 డిగ్రీల కోణంలో సముద్రం కనిపిస్తుందట. ఈ ఫ్లాట్ నుంచి వాంఖడె స్డేడియానికి వెళ్లేందుకు 20 నిమిషాలు పడుతుంది. ముంబై విమానాశ్రయానికి కూడా ఇంతే సమయం పడుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే రోహిత్ ఆ ఫ్లాట్ ఎంచుకున్నాడు. ఐతే దీని కోసం రోహిత్ 30 కోట్లు చెల్లించి ఉంటాడంటే నమ్మాల్సిన పని లేదు. అతడి వాణిజ్య ఒప్పందాలు చూసే కార్నర్ స్టోన్ ప్రతినిధి.. అహుజా కన్ స్ట్రక్షన్ కు స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. రోహిత్ కాబోయే భార్యకు అతను కజిన్ అని చెబుతున్నారు. ఈ లింకులన్నీ చూస్తుంటే రోహిత్ మొత్తం 30 కోట్లు చెల్లించి ఉండే అవకాశమే లేదు. రోహిత్ లాంటి ఫేమస్ క్రికెటర్ ఉంటున్న అపార్ట్ మెంట్లో ఫ్లాట్ అంటే ఆటోమేటిగ్గా ఇక్కడి ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడం ద్వారా అహుజా కన్ స్ట్రక్షన్ వాళ్లకు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లే. కాబట్టి రోహిత్ ఫ్లాట్ కోసం 30 కోట్లు చెల్లించి ఉంటాడననుకోవాల్సిన పని లేదు. మొత్తానికి ఇదేదో క్విడ్ ప్రో కో టైపు వ్యవహారంలాగే ఉంది.