Begin typing your search above and press return to search.
అలీభాగ్ లో 4 ఎకరాలు.. భార్యకు గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ
By: Tupaki Desk | 17 Dec 2021 5:31 AM GMTటీమిండియా కొత్త కెప్టెన్ గా అవతరించిన రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ స్థానంలో వన్డే జట్టు పగ్గాలు, అజింక్యా రహానే ప్లేసులో టెస్ట్ వైస్ కెప్టెన్సీని అందుకున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య రితికా సజ్ దేహ పేరిట ఓ ఖరీదైన భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ముంబైలోని దక్షిణ అలీభాగ్ లో రూ.9 కోట్లతో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడట.. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు భూమి పూజ కూడా పూర్తి చేశాడట ఈ సొగసరి ఆటగాడు. కాగా హిట్ మ్యాన్ కొన్న భూమి అలీభాగ్ నగరానికి 20 కి.మీల దూరంలో ఉన్న సరళ్ మహాత్రోలి అనే గ్రామ పరిధిలో ఉంది.
‘రోహిత్ తన భార్య రితికా పేరిట 4 ఎకరాలు కొన్నాడు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.9 కోట్లకు పైగానే పలుకుతోంది. అలీ భాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ముగించేశాడు. ఆ తర్వాత మా గ్రామానికి వచ్చి కొనుగోలు చేసిన స్థలంలో భూమిపూజ చేశాడు అని సరళ్ మహాత్రోలి గ్రామ సర్పంచ్ అమిత్ నాయక్ తెలిపాడు.
ఈ విషయంపై అలీభాగ్ సబ్ రిజిస్ట్రార్ సంజన జాదవ్ స్పందిస్తూ ‘భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి రోహిత్ మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. భూమిని కొన్నాడా? కొనుగోలు చేయించాడా? అన్నది తెలియదని పేర్కొన్నాడు.
ముంబై సమీపంలో ఉన్న అలీభాగ్ నగరానికి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరుంది. ఇక్కడ ఎన్నో అందమైన లోకేషన్లు ఉన్నాయి. అందుకు తగ్గట్టే భూములకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ కూడా అక్కడ భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడే సచిన్ టెండూల్కర్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కార్, మాజీ కోచ్ రవిశాస్త్రికి కూడా భూములు ఉండడం విశేషంగా చెప్పొచ్చు.