Begin typing your search above and press return to search.
సచిన్ కు సైతం దక్కని గౌరవం రోహిత్ శర్మ సొంతం
By: Tupaki Desk | 4 Jan 2020 7:50 AM GMTటీమిండియా స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ పరుగుల యంత్రమైన రోహిత్ శర్మకు కొత్త సంవత్సరం వేళ అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేయబోయే శ్రీరామచంద్ర మిషన్ నిర్మించే భారీ క్రికెట్ స్టేడియానికి రోహిత్ శర్మ పేరు పెట్టాలని నిర్ణయించారు.
తాజాగా హైదరాబాద్ వచ్చిన రోహిత్ శర్మ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయితీపరిధిలోని శ్రీరామ చంద్రమిషన్ ఆశ్రమం లో ‘రోహిత్ శర్మ ’క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రోహిత్ శర్మ, అతడి భార్య రితిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ మార్గ దర్శకుడు కమలేష్ పటేల్ మాట్లాడుతూ ‘రోహిత్ శర్మ’ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని.. అందుకే ఈ స్టేడియానికి అతని పేరు పెడుతున్నామని తెలిపారు.
ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ రామచంద్ర మిషన్ కు తన సహచర క్రికెటర్లను తీసుకువస్తానని తెలిపారు.
దేశంలో దిగ్గజ క్రికెటర్లు అయిన సచిన్, గంగూలీ, గవాస్కర్, విరాట్ లకు సాధ్యం కానీది రోహిత్ కు సాధ్యమైంది. బతికి ఉన్నప్పుడే రోహిత్ శర్మ పేరిట ఏకంగా స్టేడియం నిర్మాణం కావడం అతడికి దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణిస్తున్నారు.