Begin typing your search above and press return to search.
రో`హిట్` బహుమతికి రితిక ఎమోషనల్!
By: Tupaki Desk | 14 Dec 2017 9:49 AM GMTబుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు డబుల్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ అవతరించాడు. డిసెంబరు 13 వ తారీకును రోహిత్ తన జీవితంలో మరచిపోలేడు. ఎందుకంటే తాను అరుదైన ఘనత సాధించిన తేదీనే తన పెళ్లిరోజు కూడా కావడంతో ఈ తేదీ ఆ జంటకు ఎంతో ప్రత్యేకమైనది. రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్ ను స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు - లైవ్ వీక్షిస్తున్న అభిమానులు కూడా ఆస్వాదించారు. ముఖ్యంగా రోహిత్ ద్విశతకానికి చేరువైన సందర్భంలో అందరూ తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. అందులోనూ ఆఖరి ఓవర్ కావడంతో అందరిలోనూ టెన్షన్ పీక్స్ కు వెళ్లింది. అయితే, అందరికన్నా ఎక్కువగా రోహిత్ భార్య రితిక తీవ్ర భావోద్వాగానికి గురైంది. ప్రస్తుతం రితిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి రోజు కావడంతో రితిక కూడా మొహాలీ వన్డేకు హాజరైంది. రోహిత్ డబుల్ సెంచరీకి చేరువయ్యే తరుణంలో ఆమె ముఖంలో భావోద్వేగాలు స్పష్టంగా కనిపించాయి. ఎట్టకేలకు నరాలు తెగే ఉత్కంఠకు తెరదించుతూ రోహిత్ డబుల్ సెంచరీతో తన భార్యకు రెండో వివాహ వార్షికోత్సవ కానుకనిచ్చాడు. ముందుగా అభిమానులకు - డ్రెస్సింగ్ రూంలోని సహచరులకు రోహిత్ అభివాదం చేశాడు. ఆ తర్వాత రితిక వైపు చూస్తూ తన ఉంగరం వేలును ముద్దాడి రితికకు ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. తన భర్త ఆ ఘనత సాధించిన వెంటనే రితిక కన్నీళ్లు పెట్టుకుంది. రితిక ఎమోషన్ అవ్వడం ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పవచ్చు. రెండో వివాహ వార్షికోత్సవం రోజు రితిక తనతో పాటే ఉన్నందుకు ఆనందంగా ఉందని, తానిచ్చిన బహుమతి (ద్విశతకం) ఆమెకు కచ్చితంగా నచ్చి ఉంటుందని రోహిత్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. తన బలం ఆమేనని - రితిక ఎప్పుడూ తనకు అండగా నిలుస్తుందని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడితో కూడిన క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా ఆత్మీయులు వెంట ఉండడం ప్రత్యేకమేనన్నాడు.