Begin typing your search above and press return to search.

ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు: రోహిత్

By:  Tupaki Desk   |   22 Nov 2020 2:30 AM GMT
ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు: రోహిత్
X
ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక కాని భారత క్రికెట్ ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ ఆకాడమీలో చేరారు. రోహిత్ ను ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తొడ కండరాల గాయంతో రోహిత్ ను బీసీసీఐ సెలెక్టర్లు పక్కనపెట్టారు.కానీ ఇదే రోహిత్ ముంబై ఇండియన్స్ కు ఫైనల్ లో పరుగులు చేసి ఐపీఎల్ కప్ నందించాడు.

ఈ క్రమంలోనే తనను పక్కనపెట్టిన పరిణామాలపై కలత చెందిన రోహిత్ శర్మ తాజాగా జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. ఈ సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘అసలేం జరుగుతుందనే విజయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. నేనొక విషయం చెప్పదలుచుకున్నా.. నేను నిరంతరం బీసీసీఐ, ముంబై ఇండియన్స్ తో చర్చలు జరుపుతున్నా.. లీగ్ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాను. పరుగులు చేశాను’ అని రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ పరిణామాలపై ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు.

తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నానని.. త్వరలోనే పూర్తి ఫిట్ నెస్ సాధిస్తానని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ముందు తనలో ఎలాంటి లోపాలు లేవనే విషయాన్ని అందరికీ స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్.సీ.ఏలో చేరినట్లు రోహిత్ చెప్పాడు. ఏ విషయంలోనూ తనను వేలెత్తి చూపొద్దనే ఉద్దేశంతోనే పూర్తి ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నానని తెలిపారు. పూర్తి ఫిటెనెస్ సాధించి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆడుతానని తెలిపారు.