Begin typing your search above and press return to search.

కోహ్లీ కెప్టెన్సీ.. రోహిత్ 'షాకింగ్' రియాక్షన్

By:  Tupaki Desk   |   16 Jan 2022 12:30 PM GMT
కోహ్లీ కెప్టెన్సీ.. రోహిత్ షాకింగ్ రియాక్షన్
X
విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీకి దూరమైనప్పటికీ టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ తాజాగా సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమితో విరాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి మూడు ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. సుధీర్ఘ కాలం పాటు కెప్టెన్ గా సేవలందించే అవకాశం ఇచ్చిన బీసీసీఐతోపాటు తనను కెప్టెన్ గా తీర్చిదిద్దిన మహేంద్రసింగ్ ధోనికి విరాట్ కోహ్లీ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపాడు. జట్టు విజయం కోసం తాను 120శాతం ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ గా తనకు సహకరించిన ఆటగాళ్లు, కోచ్ రవిశాస్త్రికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ వార్త కేవలం కోహ్లీ అభిమానులకే కాకుండా క్రికెట్ అభిమానులందరికీ ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు.

కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం క్రీడా అభిమానులతోపాటు ప్రముఖ ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై స్పందించారు.

‘కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్నాడనే వార్త విని తాను షాక్ కు గురైనట్టు ’ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ విజయవంతంగా పనిచేశాడంటూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు. విరాట్ కు ఈసందర్భంగా రోహిత్ అభినందనలు తెలిపారు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో ఘనవిజయాలు అందుకుంది. మొత్తం 68 టెస్టుల్లో ఏకంగా 40కిపైగా గెలిచింది. అయితే టీ20ల నుంచి తనే వైదొలిగిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించింది. అది జరిగి నెల తిరగకముందే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడం గమనార్హం.