Begin typing your search above and press return to search.
దత్తన్న పదవి కాపాడిన రోహిత్ వేముల!!
By: Tupaki Desk | 11 March 2016 11:30 AM GMTహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల మరణం విషయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లక్ష్యంగా సాగిన దుమారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దత్తాత్రేయ లేఖ వల్లే రోహిత్ సస్పెన్షన్ కు గురయ్యాడని, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇపుడు ఆ ఆరోపణలే దత్తన్నకు ఆయాచిత వరంలా మారాయి.! ఆయన మంత్రి పదవి ఊడిపోకుండా రోహిత్ ఆత్మహత్య ఘటన నిలుపుదల చేసింది!! నమ్మలేకున్నా...హెచ్ సీయు ఘటనకు ముందు కేంద్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు దీన్ని అవుననే ద్రువీకరిస్తున్నాయి.
హెచ్‌సీయులో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి వారం ముందే దత్తాత్రేయను ఆ పదవి నుంచి తప్పించేందుకు (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పేరుతో) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించినట్టు సమాచారం. అంతకుముందు కేంద్రమంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, కొందరిని ఇంటికి పంపి, మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి భావించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వర్గాలు తాజాగా ఉప్పందించాయి. ఆయా మంత్రుల శాఖల పనితీరుపై ప్రధాని మోడీ సమీక్షించినప్పుడు అత్యంత పేలవమైన పనితీరును బండారు దత్తాత్రేయ కనబరుస్తున్నారనే నిర్ధారణకు వచ్చారు. ఆయన కేవలం తెలంగాణకు మంత్రిగా వ్యవహరిస్తున్నారే తప్ప జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపును సాధించలేకపోతున్నారని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కీలకమైన కార్మికశాఖను అప్పగిస్తే, దేశవ్యాప్తంగా ఆయా వర్గాల్ని కలుపుకొని పోవడం లేదా ఆదేశించడంలో దత్తాత్రేయ వెనుకబడినట్టు ప్రధాని సమీక్షలో తేలింది. రోడ్ సేఫ్టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో ఆయన ఆయా రంగాలకు చెందిన కార్మికవర్గాల్లో సానుకూలతను సాధించలేకపోగా, ఎదురుదాడికి దిగే బలమైన ఆయుధాల్ని ప్రతిపక్షాలకు అందించారనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ని కేంద్రమంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రధాని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
అయితే హెచ్ సీయులో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో దత్తాత్రేయ ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఆయన మానవ వనరుల మంత్రిత్వశాఖకు రాసిన లేఖల ఒత్తిడి వల్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం జరిగింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. దీంతో తాను తొలగిద్దామనుకున్న మంత్రిపై ఆరోపణలు రావడంతో మోడీ పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈ దశలో దత్తాత్రేయను తప్పిస్తే...హెచ్ సీయు ఘటన వల్లే తప్పించారంటూ ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. మొత్తంగా దత్తన్న ఏది నష్టదాయకం అనుకున్నాడో ఆ అంశం ఆధారంగానే లాభపడ్డారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.