Begin typing your search above and press return to search.

ఫోర్స్స్ కి ఎక్కేసిన 26 ఏళ్ల తెలుగు కుర్రాడు

By:  Tupaki Desk   |   14 April 2017 5:23 PM GMT
ఫోర్స్స్ కి ఎక్కేసిన 26 ఏళ్ల తెలుగు కుర్రాడు
X
తెలుగోడు ఎంత మొన‌గాడ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లువురు ప్రూవ్ చేశారు. అయితే.. ఇప్పుడు చెప్ప‌బోయే వ్య‌వ‌హారం ఇందుకు మ‌రికాస్త భిన్న‌మైంది. ఎందుకంటే కేవ‌లం 26 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కేసి సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. తెలుగోడు ఎవ‌రికీ తీసిపోడ‌న్న విష‌యాన్ని ఈ కుర్రాడు ప్ర‌పంచానికి చాటి చెప్పాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ.. ఆ తెలుగు కుర్రాడు ఎవ‌రు? అత‌డేం చేశాడు? అత‌నెందుకు ఎందుకు ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడ‌న్న విష‌యాన్ని చూస్తే..

హైద‌రాబాద్‌ కు చెందిన రోహిత్ పోతుకూచి ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కారు. ప్ర‌స్తుత ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే యువ పారిశ్రామిక‌వేత్త‌లు.. సృజ‌న‌శీలురు.. నేత‌ల్ని ఫోర్బ్స్ 30 అండ‌ర్ 30 ఏషియా జాబితాలోకి ఎంపిక చేస్తోంది. ఈ విభాగానికి ఎంపికైన అతి కొద్దిమందిలో రోహిత్ ఒక‌రు. ఇక‌.. తెలుగువారికి ఇలాంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌టం ఈ మ‌ధ్య కాలంలో జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. 2013లో హైద‌రాబాద్ న‌ల్సార్ న్యాయ విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌న‌భ్య‌సించిన రోహిత్‌.. న్యాయ‌విద్య‌కు సంబంధించి ఆయ‌న రాసిన రీసెర్చ్‌ను హార్వ‌ర్డ్ లా స్కూల్ గుర్తించింది.

అంతేనా.. అత‌ను త‌యారు చేసిన డాక్యుమెంటేష‌న్‌ను దేశంలోని 300ల‌కు పైగా లా స్కూళ్ల‌లో ఉప‌యోగిస్తుండ‌టం విశేషం.

హైద‌రాబాద్‌లో పుట్టిన రోహిత్‌.. ఏడాది వ‌య‌సులోనే అమెరికాకు వెళ్లిపోయారు. అనంత‌రం 14 ఏళ్ల త‌ర్వాత భార‌త్‌కు వ‌చ్చిన తమిళనాడులోని కొడైకెనాల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చ‌దివారు. అనంత‌రం నల్సార్‌ యూనివర్సిటీలో లా కోర్సు చేశారు. అనంత‌రం యూసీ బ‌ర్కెలీ యూనివర్సిటీలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. రోహిత్ త‌యారు చేసిన డాక్యుమెంటేష‌న్ ను హార్వర్డ్ స్కూల్ గుర్తించింది. లా వృత్తిలోనే కాదు.. రోహిత్‌లో మ‌రో కోణం ఉంది. దేశానికి వెన్నుముక‌గా నిలిచే అన్న‌దాత‌కు ఏదో ర‌కంగా సాయం చేయాల‌న్న ఉద్దేశంతో verdentum.org అనే ఒక యాప్‌ను త‌యారు చేశారు.

ఈ యాప్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే..ఇందులో రైతులు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. అలా న‌మోదు చేసుకున్న రైతుల వివ‌రాల్ని ప‌లు ఎన్జీవోలు ప‌రిశీలించి.. వారికి అవ‌స‌ర‌మైన సాయాన్ని అందిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ యాప్ ద్వారా 30వేల మంది రైతులు ల‌బ్థి పొంద‌డ‌టం విశేషం. ప్ర‌స్తుతం ఈ యాప్‌ ను తానే ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లుగా రోహిత్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌.. న్యూయార్క్ మ‌ధ్య ష‌టిల్ చేస్తున్న రోహిత్‌.. రానున్న రోజుల్లో మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుందాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/