Begin typing your search above and press return to search.
కోపం నషాళానికి అంటి.. రోహిత్ కాలితో ఏం చేశాడంటే...?
By: Tupaki Desk | 19 Feb 2022 11:34 AM GMTమైదానంలో ప్రశాంతంగా కనిపించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెటిజన్ల ట్రోలింగ్ కు చిక్కాడు. సహచరులను ఎప్పుడూ ప్రోత్సహించే అతడు అనూహ్యంగా ఆగ్రహానికి గురవడమే దీనికి కారణం. ఆ కోపంలో రోహిత్ చేసిన పని మరింత మందికి కోపం తెప్పించింది. ఇంతకూ ఏం జరిగిందంటే..? శుక్రవారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 16వ ఓవర్ వేసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ .. హార్డ్ హిట్టర్ రామన్ పావెల్ క్యాచ్ వదిలేశాడు. అప్పటికి రెండు జట్ల మధ్య మ్యాచ్ సమానంగా ఉంది. అయితే, భువీ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ మన వైపే మొగ్గేది.
అలాంటి సమయంలో బౌలింగ్ కు దిగి కాట్ అండ్ బౌల్డ్ క్యాచ్ వదిలేయడం రోహిత్ కు మంట పుట్టించింది. తీవ్ర నిరాశకు గురైన హిట్‌మ్యాన్.. భువీ క్యాచ్ వదిలేయగా కిందపడిన బంతిని కోపంతో తన్నాడు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన పలువురు అభిమానులు.. కెప్టెన్‌గా ఉంటూ ఇలా చేయొద్దని సూచిస్తున్నారు. మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరుగుతాయని, కోపంతో, చిరాకుపడటం సరికాదని హితవు పలుకుతున్నారు.
హోరాహోరీలో తప్పలేదు..
ఈడెన్ గార్డెన్స్ లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 178/3 స్కోర్‌కే పరిమితమై.. 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నికోలస్ పూరన్ (62), రామన్ పావెల్ (68*) మ్యాచ్ గెలిపించడానికి ప్రయత్నించారు. భువి వేసిన 16వ ఓవర్‌లో ఓ షార్ట్‌పిచ్ బంతిని పావెల్ గాల్లోకి లేపాడు. భువనేశ్వర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా.. బంతి చేజారింది. అప్పటికి పరిస్థితి విండీస్‌కు అనుకూలంగా ఉండటంతో రోహిత్ ఆగ్రహానికి గురయ్యాడు. చివరికి భువీనే 19వ ఓవర్‌లో కేవలం 4 పరుగులిచ్చి పూరన్‌ను ఔట్ చేయడంతో ఫలితం భారత్ వైపు మళ్లింది.
దీంతో టీమ్‌ఇండియా విజయం సాధించడంలో ఈ పేస్ బౌలరే ప్రధాన కారణమని కూడా నెటిజన్లు కెప్టెన్‌కు చురకలు అంటిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో రోహిత్ శర్మ టీమిండియా పూర్తి స్థాయి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ తో ముగిసిన వన్డే సిరీస్ ను 3 0తో భారత్ సొంతం చేసుకోగా... టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2 0తో గెల్చుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
పదేపదే క్యాచ్ లు మిస్.. రోహిత్ ఏం చేస్తాడు మరి?
వెస్టిండీస్ సిరీస్ లో భారత ఆటగాళ్ల చేతుల్లోంచి క్యాచ్ లు నేలపాలు కావడం తరచూ జరుగుతోంది. తొలి టి20లో కుర్ర స్పిన్నర్ రవి బిష్ణోయి క్యాచ్ పట్టి గ్రౌండ్ రోప్ ను తొక్కడంతో అది సిక్స్ గా మారింది. శుక్రవారం నాటి మ్యాచ్ లోనూ అతడు ఓ క్యాచ్ వదిలేశాడు. దీంతోనే రోహిత్ కు కోపం వచ్చి ఉంటుంది. అయితే, మరోవైపు మ్యాచ్ లు కోల్ కతా లో జరుగుతుండడం అక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండడంతో బంతిపై పట్టు దొరకడం కష్టమవుతోంది. అందుకనే క్యాచ్ లు దొరకడం లేదు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్ లను నేలపాలు చేశారు. దీనిపై రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడు.
కాలితో తన్నినందుకు మరో పరుగు లాస్...
క్యాచ్ నేలపాలు కావడంతోనే ఇబ్బంది అనుకుంటే.. రోహిత్ కాలితో తన్నిన బంతి కొంత దూరం వెళ్లడంతో ఓవర్ త్రో రూపంలో ఒక పరుగు విండీస్ జట్టుకు లభించింది. రోహిత్ కాలితో తన్నే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రోహిత్ నువ్వు అలా చేయాల్సింది కాదు అంటూ కామెంట్స్ పెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.