Begin typing your search above and press return to search.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ ఎంపిక.. పూర్తి జట్టు ఇదే!
By: Tupaki Desk | 19 Feb 2022 2:46 PM GMTటీమిండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇన్నాళ్లు టీ20, వన్డేలకు మాత్రమే ఉన్న రోహిత్ తాజాగా టెస్టులకు కూడా ఎంపికవ్వడంతో మూడు ఫార్మాట్లకు అతడే కెప్టెన్ అయ్యాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు రోహిత్ ఎంపికవ్వడం ద్వారా పూర్తి స్థాయి కెప్టెన్ గా అవతరించాడు.
గత జనవరిలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సడెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోగా.. కెప్టెన్సీలో రేసులో రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహల్, రిషబ్ పంత్, జస్ ప్రీత్ బుమ్రా పేర్లు వినిపించాయి. కానీ రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించగా.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం శనివారం జట్టును ఎంపిక చేసిన భారత సెలక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
ఈ నెల 24న లక్నో వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుండగా.. ఆ తర్వాత ధర్మశాలలో 26, 27న వరుసగా రెండు, మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అనంతరం మార్చి 4 నుంచి మొహలీలో ఫస్ట్ టెస్ట్, మార్చి 12 నుంచి బెంగళూరులో రెండో టెస్ట్ జరుగనుంది.
మొహాలీ టెస్ట్ కోహ్లీకి కెరీర్ లో 100వ టెస్ట్ కానుంది. టీ20 మ్యాచ్ లన్నీ రాత్రి 7 గంటలకు, తొలి టెస్ట్ ఉదయం 9.30 గంటలకు, రెండో టెస్ట్ డే నైట్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది.
-శ్రీలంకతో రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ (కెప్టెన్), మయాంక్, ప్రియాంక్ పాంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, హనుమ విహారి, గిల్, పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, బుమ్రా (వైఎస్ కెప్టెన్),షమీసిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.