Begin typing your search above and press return to search.
అఫిషియల్: రోహిత్ వేముల దళితుడు కాదట..
By: Tupaki Desk | 23 Dec 2017 5:46 AM GMTహైదరాబాద్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల సామాజికవర్గం విషయంలో చాలాకాలంగా వివాదం - సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు స్పష్టత ఇచ్చారు. రోహిత్ వేముల దళితుడు కాదని వారు తేల్చారు. ఈ మేరకు ఓ నివేదికను తెలంగాణ పోలీసులకు సమర్పించారు. ఈ నివేదికను తెలంగాణ పోలీసులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
సంచలనం సృష్టించిన రోహిత్ ఆత్మహత్య విచారణలో భాగంగా అతని సామాజిక వర్గం గురించి తెలుసుకోవడానికి రోహిత్ సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లా యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించారు. పీహెచ్ డీ చదువుతున్న రోహిత్ ను కళాశాల నుంచి సస్పెండ్ చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాగా రోహిత్ వేముల దళితుడు కాదని ఫిబ్రవరిలోనే ఏపీ ప్రభుత్వం నియమించిన జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధారించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే అప్పట్లో ధృవీకరించారు. రోహిత్ దళితుడు కాదని నిర్ధారించిడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేసును పక్కదారి పట్టించడానికే తప్పుడు నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. అయితే.. తాజాగా మరోసారి రోహిత్ దళితుడు కాదన్న నివేదిక రావడంతో మరోసారి ఇది వివాదాస్పదమవుతోంది. రోహిత్ ఆత్మహత్య చేసుకుని సుమారు రెండేళ్లవుతున్నా ఈ వివాదం ఇంకా చల్లారకపోవడంతో పాటు యూనివర్సిటీలో తరచూ ఇది వివాదాలకు దారితీస్తోంది.