Begin typing your search above and press return to search.
రోజా..అంబటి.. ఆళ్ళ...కొత్త మంత్రులు వీరే...?
By: Tupaki Desk | 26 March 2022 7:31 AM GMTఏపీలో మంత్రివర్గ విస్తరణ మీద రాజకీయం రంజుగా సాగుతోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగనుంది. నిజానికి కొత్త మంత్రులు ఎవరో ఎవరికీ తెలియదు ఒక్క జగన్ కి తప్ప. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు చూస్తే ముప్పాతిక దాకా ఉన్నాయి.
ఇందులో సీఎం గా జగన్ కాకుండా మరో ఇరవై నాలుగు మందికి మాత్రమే మంత్రులుగా చాన్స్ ఉంటుంది. మరి సోషల్ మీడియాలో మాత్రం మంత్రుల చిట్టా చూస్తే కొండవీటి చాంతాడు మాదిరిగా చాలా పెద్దదే ఉంది.
ఆ లిస్ట్ నిజమో ఏమో తెలియదు కానీ ఇంటెరెస్టింగ్ మా మాత్రం ఉంది. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే అనంతపురం దాకా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయో కూడా అందులో వివరించేశారు.
అలా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, విశాఖ నుంచి గుడివాడ అమరనాధ్, కరణం ధర్మశ్రీ, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టి రాజా. జక్కంపూడి రాజా. ఉన్నారు.
ఇక పశ్చిమ గోదావరి నుంచి తెల్లం బాలరాజు, ప్రసాదరాజు, క్రిష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, జోగి రమేష్, గుంటూరు నుంచి అంబటి రాంబారు.
ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, ప్రకాశం నుంచి సుధాకర్ బాబు, నెల్లూరు నుంచి కాకాణి గోవర్ధనరెడ్డి, చిత్తూరు నుంచి ఆర్కే రోజా, భూమన కరుణాకరరెడ్డి, కర్నూల్ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, అనంతపురం నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిల పేర్లు ఖరారు అయినట్లుగా వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఈ లిస్ట్ లో నుంచి ఎన్ని పేర్లు నిజమవుతాయో.