Begin typing your search above and press return to search.
రోజాతో సెల్ఫీల హడావుడి.. వెయిట్ చేసిన బాలయ్య!
By: Tupaki Desk | 18 Jun 2019 5:43 AM GMTఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోజా కారణంగా బాలకృష్ణ కాసేపు ముందుకు వెళ్లలేక అలా నిలబడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకిలా జరిగిందంటే..
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనటానికి బాలకృష్ణ లాబీలోకి వచ్చారు. అదే సమయంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజా అక్కడే ఉన్నారు. ఆమెతో సెల్ఫీలు దిగటానికి పెద్ద ఎత్తున అభిమానులు ఆమె చుట్టూ చేరిపోయారు. వారందరితో ఆమె ఒపిగ్గా సెల్ఫీలు దిగారు.
దీంతో అక్కడ రద్దీ ఏర్పడింది. అదే సమయంలో అటువైపుగా వచ్చారు బాలకృష్ణ. అభిమానుల రద్దీతో అక్కడ దారి మొత్తం మూసుకుపోయింది. ముందుకు వెళ్లే అవకాశం లేకపోవటంతో బాలకృష్ణ అక్కడే నిలుచుండిపోయారు. దీంతో మార్షల్ కలుగజేసుకొని బాలకృష్ణ ముందుకు వెళ్లేందుకు దారి ఇచ్చారు. ఆ సందర్భంగా రోజా.. బాలకృష్ణలు ఒకరినొకరు పలుకరించుకున్నారు. బాగున్నారా? అని రోజా ప్రశ్నించగా.. ఫైన్ అంటూ బాలయ్య బదులిచ్చారు.
రోజాతో సెల్ఫీల కారణంగా చోటు చేసుకున్న రద్దీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చిక్కుకుపోయారు. ఆయన ముందుకు వెళ్లేందుకు మార్షల్స్ సాయం చేశారు. కాసేపటికి అక్కడకు సీనియర్ నేత.. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చారు.
ఆయన్ను చూసిన రోజా నవ్వుతూ పలుకరించారు. మీరు మావైపు వస్తారనుకున్నాం అన్నా.. కానీ అటు నుంచి వచ్చారన్నారు. దీనికి బలరాం నవ్వుతూ వెళ్లిపోయారు. మొత్తానికి రోజా పుణ్యమా అని అసెంబ్లీ లాబీల్లో ట్రాఫిక్ జాం అయిన పరిస్థితి.