Begin typing your search above and press return to search.
బాబు చేతల రాయుడు కాదు..కోతలరాయుడు
By: Tupaki Desk | 1 Oct 2018 4:32 PM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న పథకంపై ప్రధాన ప్రతి పక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత అమలు చేస్తున్న నిరుద్యోగ భృతి విషయంలో బాబు చెప్తోంది ఒకటి...చేస్తోంది మరొకటి తేల్చిచెపుతోంది. తాజాగా పార్టీకి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు - ఎమ్మెల్యే ఆర్కే రోజా - పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో వేర్వేరుగా మాట్లాడుతూ బాబు తీరుపై మండిపడ్డారు.
మొదట రైతులను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిరుద్యోగులను సైతం మోసం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. నిరుద్యోగ భృతి 2వేల రూపాయలిస్తామని ప్రగల్భాలు పలికి చివరకు సగానికి సగం కోతకోసి 1000 రూపాయలు చేతిలో పెట్టేందుకు బాబు సిద్ధమయ్యాడని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే రుణమాఫీ పేరుతో రైతుల చెవిలో చంద్రబాబు పూలు పెట్టారని, ఇప్పుడు యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు టోకరా వేయబోతున్నాడని విమర్శించారు. తనకు అనుకూలమైన వారికే నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్న సిగ్గులేని నాయకుడు చంద్రబాబు నాయుడని రోజా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడికి ప్రజలు వాతలు పెట్టాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇల్లు - రేషన్ కార్డులు - పింఛన్లకు రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సిగ్గు - శరం లేకుండా కాంగ్రెస్ తో కలసి వెళ్లాలనుకుంటున్న చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని రోజా స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్ ని భూస్థాపితం చేసినట్టే.. 2019 ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, ఎన్నికల ముందు డ్రామా కోసం నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు యువతను - నిరుద్యోగులను వంచించారని 2.12 లక్షల ఉద్యోగాలను భర్తీచేయకుండా దగా చేశారని విమర్శించారు. నెలకు రూ.2వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి వెయ్యికి కోతపెట్టారని - 50లక్షల మంది లబ్ధిదారులను 10 లక్షలకు కుదించారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు..బాబును నమ్మి నట్టేట మునిగిన నిరుద్యోగులు జగన్ పై నమ్మకం పెట్టుకున్నారన్నారు. పాదయాత్రలో పెద్దఎత్తున యువత భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.